- తీసుకున్న లోన్ రూ.70 వేలు
- చూపిస్తోంది రూ.3 లక్షలు
- పరిమితి దాటి రుణమాఫీకి నోచుకోని అన్నదాతలు
నల్లవెల్లి వెలుగు: బ్యాంకు ఆఫీసర్ల నిర్లక్ష్యం ఇద్దరు రైతులకు రుణమాఫీ రాకుండా చేసింది. వరంగల్జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన మేర్గు సూరయ్య, వక్కల చిన్న ఓదెలు రైతులు. వీరు నర్సంపేట యూనియన్ బ్యాంకులో గత ఏడాది పట్టాబుక్పెట్టి క్రాప్లోన్తీసుకున్నారు. కాంగ్రెస్రైతులకు రుణమాఫీ చేయగా రెండు లిస్టుల్లోనూ పేరు రాలేదు. దీంతో నల్లబెల్లి ఏవోను మేర్గు సూరయ్య అడగ్గా అతడి ఆధార్నంబర్ఆధారంగా చెక్ చేశాడు. అయితే ఒకటే లిస్టులో సూరయ్యతో పాటు ఓదెలు పేరు కూడా కనిపించింది.
అందులో ఇద్దరికి కలిసి రూ. రూ.మూడు లక్షలకు పైగా అప్పు ఉందని చూపించింది. కానీ, ఇద్దరూ వేర్వేరుగా రూ.60, 70 వేల లోపే లోన్తీసుకున్నారు. ఇదేంటని, తప్పులను ఎవరు సరి చేస్తారని అడిగితే బ్యాంక్‌కు వెళ్లమని సమాధానమిచ్చారు. యూనియన్బ్యాంక్మేనేజర్ను వెళ్లి అడిగితే తహసీల్దార్‌ను అడగాలని వెళ్లగొట్టారు. ఇలా మండలంలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నట్టు తెలిసింది. ఇప్పటికైన జిల్లా ఆఫీసర్లు ఆధార్, రేషన్‌కార్డు కాకుండా బ్యాంక్‌పాస్‌బుక్ ఆధారంగా రుణమాఫీ వర్తింపజేయాలని కోరుతున్నారు.