వనపర్తి , వెలుగు: బ్యాంకులు రైతులకు, ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యతనివ్వాలని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం బుద్ధారంలో యూనియన్ బ్యాంక్ నూతన బ్రాంచ్‌ను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ బ్యాంకులు రైతులకు, ఎంఎస్ఎంఈలకు పెద్దపీట వేయాలని, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, యువతకు ఉపాధి శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు సహకరించాలని సూచించారు. అనంతరం గోపాల్‌పేటలో రూ. 13.50 లక్షలతో నిర్మించిన సైన్స్ ల్యాబ్, హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. అంతకుముందు పెద్దమందడి, వెల్టూరు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ప్రారంభించారు. ఇదే వేదికపై ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను
అందజేశారు.

