60 ఏండ్లలో కాంగ్రెస్ ​చేసిందేమీ లేదు : బాణోత్ మదన్ లాల్

60 ఏండ్లలో కాంగ్రెస్ ​చేసిందేమీ లేదు : బాణోత్ మదన్ లాల్

వైరా, వెలుగు : అరవై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని, ఇప్పుడు ఆరు గ్యారంటీల పేరుతో అసలు గ్యారంటీ లేని విధంగా మాట్లాడుతోందని వైరా బీఆర్ఎస్ అభ్యర్థి బాణోత్ మదన్ లాల్, ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ ​అన్నారు. ఆదివారం వైరా మున్సిపాలిటీలోని పలు వార్డులలో ప్రచారాన్ని నిర్వహించారు.

మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, దిశ కమిటీ సభ్యులు కట్టా కృష్ణార్జునరావు, వైరా మార్కెట్ చైర్మన్ పసుపులేటి మోహనరావు, నాయకులు డాక్టర్ కాపా మురళీకృష్ణ, వనమా చిన్ని, మేదరమెట్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.