సరిపడా యూరియా నిల్వలున్నాయి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

సరిపడా యూరియా నిల్వలున్నాయి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
  •     ఉదయం 6 గంటల నుంచి యూరియా పంపిణీ ప్రారంభం

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం జిల్లాలో సరిపడా యూరియా స్టాక్ అందుబాటులో ఉందని, రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల రోజులకు సంబంధించి 13 వేల 642 మెట్రిక్ టన్నుల యూరియా ఖమ్మం జిల్లాకు అవసరం ఉండగా..  ఇప్పటి వరకు 9 వేల 407 మెట్రిక్ టన్నుల స్టాక్ వచ్చిందని, జిల్లాలో మరో 5 వేల 100 మెట్రిక్ టన్నుల స్టాక్ రిజర్వ్ ఉందని కలెక్టర్ తెలిపారు. 

యూరియా సరఫరాలో ఎటువంటి కొరత లేదని తెలిపారు.ఖమ్మం జిల్లాలో యూరియా బుకింగ్ యాప్ వచ్చే వరకు ఆఫ్ లైన్ పద్ధతిలో రైతు పట్టాదారు పాస్ పుస్తకం పరిశీలించి  యూరియా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రైతులు సాగు చేసే పంట స్వభావం అనుగుణంగా యూరియా సరఫరా చేస్తామని   తెలిపారు. 

జిల్లాలో యూరియాకు ఎటువంటి కొరత లేదని ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ప్రతి కొనుగోలు కేంద్రం ద్వారా యూరియా అందిస్తున్నామని రైతులు ఆందోళన చెందకుండా అవసరమైన మేర యూరియా కొనుగోలు చేసి తీసుకుని వెళ్లాలని, అధికంగా కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకోవద్దని సూచించారు