- పీవో బి.రాహుల్
భద్రాచలం,వెలుగు : ఆదివాసీ మహిళలు స్వశక్తితో కుటీర పరిశ్రమలు నెలకొల్పి, వారి కుటుంబాన్ని పోషించుకోవడమే కాకుండా మరో పది మందికి జీవనోపాధి కల్పించి ఆదర్శవంతంగా ఉంటున్నారని ఐటీడీఏ పీవో బి.రాహుల్ ప్రశంసించారు. తన చాంబర్లో సోమవారం చర్ల మండలం సున్నంగుంపు గ్రామానికి చెందిన శ్రీముత్యాలమ్మ జాయింట్ గిరిజన మహిళ సొసైటీ సభ్యులు వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేయడానికి రూ.1లక్ష చెక్కును అందజేసి మాట్లాడారు. ఇప్ప పువ్వు లడ్డూలు, నల్లేరు పచ్చడి తయారు చేసి అమ్మకాల ద్వారా ఆదాయం సాధిస్తున్నారని మెచ్చుకున్నారు.
సొసైటీని సక్రమంగా నడుపుకుని లాభాల బాటలో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం దర్బారులో పాల్గొన్న ఆయన దట్టమైన పొగ మంచు కారణంగా ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్ధుల ఆరోగ్యం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్ఎంలు, వార్డెన్లను ఆదేశించారు. దర్బారులో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆదివాసీలు ఇచ్చిన ఆర్జీలను పరిశీలించి యూనిట్ ఆఫీసర్లకు పరిష్కారం కోసం పంపించారు. ఉద్యోగులతో సమావేశం నిర్వహించి సిబ్బంది సఖ్యతతో ఉండి గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
