చేతులు లేకపోయినా.. కాళ్లతోనే అద్భుతం చేసింది

చేతులు లేకపోయినా.. కాళ్లతోనే అద్భుతం చేసింది

ఆమెకు చేతులు లేవు.. కాళ్లతోనే అన్ని పనులు చేసుకుంటుంది. చేతులు లేకపోయినా.. తనలో ఉన్న లోపాన్ని పక్కనపెట్టి ధైర్యంగా ముందడుగు వేసింది. బంగ్లాదేశ్‭కు చెందిన బాను అక్తర్‭కు పుట్టుకతోనే చేతులు లేవు. పుట్టగానే ఇంట్లో వాళ్లు తనను చేసి భయపడ్డారు. తల్లి కూడా పాలు ఇవ్వకుండా వదిలేసిందని బాను అక్టర్ చెప్పారు. వికలాంగులను పెంచడం భారం అవుతుందని.. చుట్టుపక్కల వాళ్లు ఆమెను చంపేయమని తల్లిదండ్రులకు సలహా ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేసింది. తల్లిదండ్రులు తనకు నడక నేర్పించకపోయినా.. సొంతంగా నడవడం నేర్చుకున్నానని చెబుతోంది. 

ఊళ్లో ఓ పెద్దమనిషి సహాయంతో స్కూలుకు వెళ్లింది. స్కూల్లోనూ అడుగడుగునా అవమానాలే.. ఎవరూ తనను పట్టించుకునే వారు కాదు. ఇంట్లో వాళ్లు చూడకపోవడంతో.. ఇల్లు వదిలి ఢాకా వచ్చేసింది. తనను తాను పోషించుకోవడానికి పనికోసం ఇంటింటికి తిరిగింది. కాని చేతులు లేవని ఎవరూ అవకాశం ఇవ్వలేదు. పనిలేకున్నా అడ్డుక్కోవడానికి సిగ్గుగా అనిపించి.. అందరిలాగానే తాను కష్టపడి సంపాదించాలి అనుకుంది. బీడ్స్‭తో కళాకృతులను తయారు చేయడంలో నైపుణ్యం సాధించింది. బీడ్స్ తో ఎంతో అందమైన కళాకృతులను తయారు చేస్తోంది. వాటిని అమ్ముకుంటూ తన జీవనాన్ని గడుపుతోంది. ప్రస్తుతం తాను బతకడానికి సరిపడా డబ్బును ఆమె సంపాదించుకుంటోంది. తనలా వికలాంగులైన ఎంతో మందికి బాను అక్తర్ ఆదర్శంగా నిలిచారు.