ఈ కథ చెప్పడం కన్నా తెరపై చూస్తేనే బాగుంటుంది

ఈ కథ చెప్పడం కన్నా తెరపై చూస్తేనే బాగుంటుంది

హీరో అగస్త్య, హీరోయిన్ నక్షత్ర జంట‌గా నటిస్తున్న చిత్రం "బాపట్ల ఎంపీ". ఎంపీ నందిగం సురేష్ జీవితం ఆధారంగా ఈ మూవీ రాబోతుంది. అతి సామాన్య దళిత కుటుంబంలో పుట్టిన వ్యక్తి, తను నమ్మిన సిద్ధాంతాల కోసం నిజాయితీగా పోరాటం చేస్తూ, ఒక బలమైన నాయకుడిగా ఎలా ఎదిగాడు అనేదే ఈ సినిమా కథ. సురేఖ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమాను నందిగం వెంకట్ నిర్మిస్తున్నారు. నానాజీ మిరియాల దర్శకత్వంలో ఈమూవీ తెర‌కెక్కుతున్నది. ఈ చిత్రం ఇవాళ హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు ఘనంగా జరుపుకుంది.. ఈ కార్యక్రమానికి ఎంపీ నందిగం సురేష్, తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు అనంతరం అగస్త్య, నక్షత్ర హీరో, హీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశానికి ఎంపీ నందిగం సురేష్, క్లాప్ నివ్వగా.. ఈ చిత్ర నిర్మాతల కుమారులు దేవన్, ప్రిన్స్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో.. 

చిత్ర నిర్మాత నందిగం వెంకట్ మాట్లాడుతూ.. 'చిన్నప్పటి నుండి తమ్ముడు నాతో చేసిన జర్నీ.. తరువాత యూత్ ప్రెసిడెంట్ గా ఎదిగిన వైనం.. ఆ తరువాత కొన్ని దుష్ట శక్తులు అణిచివేయాలని చూశాయి. చేయరాని, చేయలేని, చేయకూడని సంఘటనలో మా తమ్ముడిని ఇరికించాలని చూశారు. అక్కడ నుండి జగన్ మోహన్ రెడ్డి మంచి మనసుతో సపోర్ట్ ఇవ్వడం. ఆ తరువాత జగన్ సపోర్ట్ తో ఎలా ఎంపీ అయ్యాడు అనేదే ఈ కథాంశం. ఈ కథ చెప్పడం కన్నా తెరపై చూస్తేనే బాగుంటుంది' అని అన్నారు.

చిత్ర దర్శకుడు నానాజీ మిరియాల మాట్లాడుతూ.. ఇది బాపట్ల ఎంపీ నందిగం సురేష్ లైఫ్ స్టోరీ. అరిటాకులు కొసుకొని బ్రతికే ఒక సామాన్య వ్యక్తి తన నిజాయితీని నమ్ముకొని, తను నమ్మిన సిద్ధాంతాలతో ముందుకు వెళ్తూ నిజాయితీగా ఉంటే.. కొందరు వ్యక్తులు ఇతను చెయ్యని తప్పును ఇతను మీద రుద్దుతూ పోలీస్ స్టేషన్ లో పెట్టి ఇబ్బంది పెట్టినపుడు జగన్ చేరదీశారు. ఈ వ్యక్తి యొక్క సిద్ధాంతాలు నచ్చి ఒక గొప్ప నాయకుడు అవ్వడానికి జగన్, సురేష్ అనే ఒక సామాన్య వ్యక్తికి ఏ విధమైన సపోర్ట్ ఇచ్చారు. ఈ వ్యక్తి లైఫ్ లో ఎంత స్ట్రగుల్ పడ్డాడు అనేదే ఈ కథ. ప్రతి సామాన్యుడు చూడాల్సిన సినిమా ఇది. ఏ పని చేసినా నిజాయితీగా చేస్తే కచ్చితంగా ఎదుగుతాడు అనేది ఈ సినిమా చూపించాము. ఈ సినిమాలో ఎవరినీ ఉద్దేశించి తీసిన సినిమా కాదు. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది. డి. ఓ. పి.శ్యామ్ కె .నాయుడు, అనూప్ రూబెన్స్ మ్యూజిక్, ఎడిటర్ మార్తండ్ వెంకటేష్ ఈ కథ విని ఈ సినిమాకు వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అన్నారు 

చిత్ర హీరో అగస్త్య మాట్లాడుతూ.. 'బాపట్ల ఎంపీ కథను నానాజీ చెప్పినపుడు పొలిటికల్ స్టోరీ అని బయపడ్డాను. అయితే ఇందులో అదేమీ లేకుండా సామాన్యుడు అయిన తను ఎదగడానికి ఎంత కష్టపడ్డాడు అనే స్టోరీ నాకు నచ్చింది. ఇలాంటి సినిమాలో నటనకు మంచి స్కోప్ ఉంటుందని నమ్మి ఈ సినిమా చేస్తున్నాను' అన్నారు.

చిత్ర హీరోయిన్ నక్షత్ర మాట్లాడుతూ.. 'నాకు మంచి నేటివిటీ ఉన్నటువంటి పలాస 1978 సినిమా ద్వారా నాకు మంచి పేరు వచ్చింది. అలాంటి నేటివిటీ ఈ కథలో కనిపించింది. కథ విన్నాను నాకు బాగా నచ్చింది. నందిగామ లైఫ్ లో ఎంత స్ట్రగుల్ పడ్డాడు. ఆ స్ట్రగుల్ లో తన వైఫ్ ఎలాంటి సపోర్ట్ ఇచ్చింది అనేది ఇందులో చక్కగా చూపించారు. ఇలాంటి మంచి సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని' అన్నారు.

నటీనటులు:
అగస్త్య, నక్షత్ర తదితరులు

టెక్నికల్ టీమ్:
దర్శకుడు: నానాజీ మిరియాల
బ్యానర్: సురేఖ ప్రొడక్షన్స్
నిర్మాత: నందిగం వెంకట్
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కే నాయుడు
సంగీతం: అనూప్ రూబెన్స్
ఎడిటర్ : మార్తాండ్ కే వెంకటేష్
ఆర్ట్ : గాంధీ నడికుడికర్
PRO : ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్