బొమ్మలా మారాలని 83 లక్షలు ఖర్చు పెట్టింది

బొమ్మలా మారాలని 83 లక్షలు ఖర్చు పెట్టింది

బార్బీ బొమ్మంటే అందరికీ ఇష్టమే. అమ్మాయిలకు బార్బీ అంటే చిన్నప్పటి నుంచే క్రేజ్​. ఆ ఇష్టంతోనే బార్బీ బొమ్మలు తెగ కొనేస్తుంటారు. బార్బీలాంటి డ్రెస్​లు వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కేక్స్, యాక్సెసరీస్​ల్లో కూడా బార్బీనే ఇమిటేట్ చేస్తుంటారు. అంతవరకు బాగానే ఉంది.. కానీ, ఆస్ట్రేలియాకు చెందిన పాతికేండ్ల అమ్మాయి బార్బీ అంటే ఇష్టంతో ఏం చేసిందో తెలుసా.. తనే బార్బీలా మారిపోవాలనుకుంది. అంతే... అనుకున్నట్టే ‘రియల్ లైఫ్​ బార్బీ’ కావాలని దాదాపు లక్ష డాలర్లు ఖర్చుపెట్టింది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 82.80 లక్షలు.