రేపు బాసర ఆలయం మూసివేత

రేపు బాసర ఆలయం మూసివేత

 మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం మూసివేయనున్నారు. భక్తులకు అమ్మవారి దర్శనం, ఆర్జిత సేవలు రద్దు చేస్తామని ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం7 గంటలలోపు నిత్యపూజ, ఆరాధన, మహా నివేదన ఉంటుందన్నారు. అనంతరం అమ్మవారి ప్రధాన అలయంతో పాటు ఉపాలయాలను ద్వార బంధనం చేస్తామని చెప్పారు. 

సాయంత్రం 7 గంటలకు మహాసంప్రోక్షణ అనంతరం అమ్మవారికి అభిషేకం, నివేదన, హారతి ఇస్తామన్నారు. ఎల్లుండి యథావిధిగా ఆర్జిత సేవలు, భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చని పేర్కొన్నారు.