18 ఏళ్లు నిండితే బీటెక్ లో నో ఎడ్మిషన్..

18 ఏళ్లు నిండితే బీటెక్ లో నో ఎడ్మిషన్..

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా బాసరలో గల రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (Rajiv Gandhi University of Knowledge Technologies-RGUKT) (Basara IIIT)  2023-24 విద్యా సంవత్సరానికి గాను ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీ.టెక్ ప్రోగాం (6-Year Integrated B. Tech Program)లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జూన్ 1న విడుదల కానుంది.  ఈ కోర్సుకు ఎంపికైన విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత వసతి, యూనిఫాంతోపాటు ల్యాప్ టాప్ వంటివి అందజేస్తుంది. కోర్సును విజయవంతంగా పూర్తిచేసిన వారు ఇంజినీరింగ్ లో ఉన్నత విద్యను అభ్యసించడంతో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

జూన్ 5న ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆన్ లైన్ ద్వారా జూన్ 19 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని వైస్ ఛాన్స్ లర్ వెంకటరమణ తెలిసారు. అయితే  స్పెషల్ కేటగిరీ విద్యార్థులు జూన్ 24  వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జూన్ 26న సెలక్షన్ లిస్ట్ విడుదల చేసి.. ఫేస్ వన్ కౌన్సెలింగ్ జూలై 1వ తేదీన ప్రారంభిస్తామని తెలిపారు.  ఓ బి సి విద్యార్థులు అప్లికేషన్ ఫీజు 500 రూపాయిలు కాగా, ఎస్సీ ఎస్టీ విద్యార్థుల అప్లికేషన్ ఫీజు450 రూపాయిలుగా నిర్ణయించారు. అయితే 18 సంవత్సరాలు నిండిన వారికి అవకాశం లేదని యూనివర్శిటీ అధికారులు తెలిపారు.

ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ కోర్సును రెండు విభాగాలు అందిస్తారు.

1. ప్రీ యూనివర్సిటీ కోర్సు (Pre University Course)

ఈ కోర్సు రెండు (02) సంవత్సరాలు ఉంటుంది. ఎంపీసీ (MPC) కోర్సు బోధిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్ (Mathematics), ఫిజిక్స్ (Physics), కెమిస్ట్రీ(Chemistry), ఇంగ్లిష్ (English), తెలుగు/ సంస్కృతం (Telugu/Sanskrit), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (Information Technology), ఎన్విరాన్మెంటల్ సైన్స్ (Environmental Science) సబ్జెక్టులు ఉంటాయి. తెలుగును ద్వితీయ భాషగా చదవని ఇతర భాషలకు చెందిన అభ్యర్థులకు మాత్రమే సంస్కృతం బోధిస్తారు.

2. బీ.టెక్ (B.Tech)

ఈ కోర్సు నాలుగు (04) సంవత్సరాలు ఉంటుంది. ఇందులో కెమికల్ ఇంజినీరింగ్ (Chemical Engineering), సివిల్ ఇంజినీరింగ్ (Civil Engineering), కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (Computer Science & Engineering), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్(Electronics & Communicati ons Engineering), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (Electrical & Electronics Engineering), మెకానికల్ ఇంజినీరింగ్ (Mechanical Engineering), మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్ (Metallurgical & Materials Engineering) కోర్సులు బోధిస్తారు.