విద్యార్థుల ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్..ట్రిపుల్ ఐటీ ఘటనపై అనుమానాలు

విద్యార్థుల ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్..ట్రిపుల్ ఐటీ ఘటనపై అనుమానాలు

నిర్మల్, వెలుగు: ఆన్​లైన్ బెట్టింగ్ వ్యవహారం విద్యార్థుల ప్రాణాలకు గండంగా మారుతోంది. రెండు రోజుల కింద బాసర ట్రిపుల్ ఐటీ లో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న చల్ల సంపత్ ఆన్​లైన్ బెట్టింగ్​కు బానిసై చేసిన అప్పుల ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 దీనిపై పోలీసులు,  క్యాంపస్ అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నప్పటికీ మృతుడి బంధువు ఒకరు ఆయన ఖాతాలో రూ.80 వేలు జమ చేసినట్లు సమాచారం. అప్పటికే బెట్టింగ్ కారణంగా అప్పుల ఊబిలోకి కూరుకుపోయిన సంపత్ గత్యంతరం లేక ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. పోలీసుల దర్యాప్తు అనంతరం విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై స్పష్టత రానుంది.