అమెరికాలో బతుకమ్మ పండుగ

అమెరికాలో బతుకమ్మ పండుగ

హనుమకొండ, వెలుగు: మన అమెరికన్ తెలుగు అసోసియేషన్(మాటా) ఆధ్వర్యంలో అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ సంబురాలు నిర్వహించడం చాలా గర్వకారణమని ఆర్గనైజేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్(ఓబీసీ) చైర్మన్, కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. అమెరికాలోని న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో మాటా ఆధ్వర్యంలో తెలంగాణ ఎన్నారైలు, మహిళలు ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా బతుకమ్మ పాటలతో ధూంధాం నిర్వహించారు. కార్యక్రమానికి చీఫ్​ గెస్ట్ గా సుందర్ రాజ్ యాదవ్ హాజరై మాట్లాడారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పండుగను ఖండాంతరాలు దాటి నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మాటా నేతలు సామల ప్రదీప్, చిన్నాల రాము, కొండ ప్రభాకర్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.