మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. మంచిర్యాల, ఆసిఫాబాద్​ జిల్లాలో వేడుకలు ఘనంగా జరిగాయి. రంగురంగు పూలతో అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మలను ప్రత్యేకంగా ముస్తాబు చేసిన ప్రాంతాలు, ప్రధాన వీధులు, చౌరస్తాలు, చెరువు గట్ల వద్దకు తీసుకొచ్చారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. 

ఒక్కొక్క పువ్వేసి చందమామ.. చిత్తూచిత్తూల బొమ్మ అంటూ వాటి చుట్టూ చేరి ఆడిపాడారు. పలు చోట్ల యువతులు డీజే చప్పుళ్లకు డ్యాన్సులు చేస్తూ ఉర్రూతలూగించారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేసి పోయిరావమ్మా అంటూ సాగనంపారు. మహిళలు ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. అమెరికాలోని డల్లాస్ లో జరిగిన వేడుకల్లో కుంటాలకు చెందిన మాజీ ఎంపీపీ అరుణ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.  - నెట్​వర్క్, వెలుగు