ఎల్లలు దాటుతున్న బతుకమ్మ వేడుకలు

ఎల్లలు దాటుతున్న బతుకమ్మ వేడుకలు

వియన్నా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ సంబురాలు ఎల్లలు దాటాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రియా  ఆధ్వర్యంలో ఆదివారం ఆస్ట్రియాలోని వియన్నా నగరంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎన్ఆర్ఐ మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆడపడుచులు రంగు రంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది బతుకమ్మ పాటలతో ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో శ్రీలత రెడ్డి,  శారద, మంజుల రెడ్డి, జయశ్రీ, రామ మాధవి, రజిత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.