ఉద్యోగులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలి : బెటాలియన్ కమాండెంట్ జయరాజ్

ఉద్యోగులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలి : బెటాలియన్ కమాండెంట్ జయరాజ్

ఇటిక్యాల, వెలుగు : ఉద్యోగులు తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని బెటాలియన్ కమాండెంట్ జయరాజ్ సూచించారు. పదో బెటాలియన్‌‌‌‌ 2013 బ్యాచ్‌‌‌‌కు చెందిన 9 మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) కానిస్టేబుల్స్ పది సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని కన్వర్షన్ ప్రక్రియలో భాగంగా జిల్లా ఆర్డ్మ్​ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (ఏఆర్)కు వెళ్తున్నారు. 

ఈ సందర్భంగా శుక్రవారం వారిని సన్మానించి వీడ్కోలు పలికారు. అనంతరం కమాండెంట్ మాట్లాడుతూ తెలంగాణ స్పెషల్ పోలీస్ విభాగంలో విధులు నిర్వహించిన సమయంలో కానిస్టేబుల్స్ చూపిన క్రమశిక్షణ, అంకితభావం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ పాణి, రిజర్వ్ ఇన్​స్పెక్టర్లు ధర్మారావు, నరసింహారాజు, శ్రీనివాసులు, ఆర్పీ సింగ్, రాజేశం, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.