నక్సల్స్ ఏరివేతను వేగవంతం చేస్తాం

V6 Velugu Posted on Apr 05, 2021

రాయ్ పూర్: నక్సల్ ఏరివేతను వేగవంతం చేస్తామని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అన్నారు. ఛత్తీస్ గడ్ లోని జోనగూడ బార్డర్ లో నక్సల్స్ కాల్పుల్లో మృతి చెందిన 22 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు షా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నక్సల్స్ దాడిలో మరణించిన వారి త్యాగాలను దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని చెప్పారు. ఛత్తీస్ గడ్ సీఎం భూపేశ్ భగేల్ తో కలిసి నక్సల్స్ దాడి గురించి చర్చించానన్నారు. గత కొన్నేళ్లలో నక్సలిజం నిర్ణయాత్మక మలుపు తీసుకుందని, ఈ ఘటనతో ఇరు వర్గాల మధ్య పోరును మరింత పెంచిందన్నారు. నక్సల్స్ఏరివేత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పని చేస్తున్నాయని తెలిపారు. 

Tagged Central government, chhattisgarh, CM Bhupesh Baghel, naxal

Latest Videos

Subscribe Now

More News