తెలంగాణ యుద్ధం మొదలైంది : ఎన్నికల నామినేషన్లు పడ్డాయి

తెలంగాణ యుద్ధం మొదలైంది : ఎన్నికల నామినేషన్లు పడ్డాయి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అసలు సిసలు యుద్ధం మొలైంది. నవంబర్ 3వ తేదీ ఉదయం 11 గంటలకు నామినేషన్ల స్వీకరణ మొదలైపోయింది. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అసలు సిసలు యుద్ధం మొలైంది. ఇన్నాళ్లు షెడ్యూల్ మాత్రమే ఉంది.. ఇప్పుడు నామినేషన్ల ఘట్టం మొదలైపోయింది.. నవంబర్ 3వ తేదీ ఉదయం 11 గంటలకు నామినేషన్ల స్వీకరణ మొదలైపోయింది. దీంతో ఇప్పటికే సీట్లు ఫిక్స్ అయిపోయిన అభ్యర్థులు.. నామినేషన్లు దాఖలు చేశారు. ప్రారంభంలోనే అభ్యర్థుల్లో ఊపు కనిపించటం విశేషం. 

ఖమ్మం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు.. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో.. ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. 

Also Read :- బీజేపీకి షాక్

ఇక  వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న  ఎర్రబెల్లి ప్రదీప్ రావు కుమారుడు ఎర్రబెల్లి వినీత్ రావు నామినేషన్ దాఖలు చేశారు. 

నామినేషన్ కేంద్రాల దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం నలుగురు, ఐదుగురు వ్యక్తులను మాత్రమే అనుమతించారు. నామినేషన్ సెంటర్ కు కొద్ది దూరంలోనే బారికేడ్లు ఏర్పాటు చేసి కార్యకర్తలు, అభిమానులను అక్కడే నిలిపివేశారు.