UAEలో బతుకమ్మల వేడుకలు

UAEలో బతుకమ్మల వేడుకలు

అబుదాబిలో బతుకమ్మ  సంబురాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేయన్స్ ఆధ్వర్యలో జరిగిన వేడుకల్లో తీరొక్క పువ్వులతో బతుకమ్మలను తయారు చేశారు. ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ వేదికలో ఏర్పాటు చేసిన సంబురాల్లో  మహిళలు, చిన్నారులు ఆడిపాడారు. ఈ కార్యక్రమానికి  UAE భారత రాయబార కార్యాలయ సిబ్బంది ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో  ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజా శ్రీనివాస రావు, సభ్యులు పాల్గొన్నారు.