
ఎన్టీఆర్‌కి జంటగా ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది జాన్వీకపూర్. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఆమె పాత్ర ఎలా ఉండబోతోందా అనే ఆసక్తి నెలకొంది. మరోవైపు హిందీలో వరుస సినిమాలు చేస్తోంది జాన్వీకపూర్. అయితే తను నటించిన చిత్రాల్లో ఎక్కువ భాగం ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. తన కొత్త చిత్రం ‘బవాల్’ను కూడా ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. వరుణ్ ధావన్, జాన్వీ జంటగా నితీష్ తివారి డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. వచ్చే నెలలో అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల కాబోతోంది. ఇప్పటివరకూ జాన్వీ ఆరు సినిమాల్లో నటించగా, అందులో ఘోస్ట్ స్టోరీస్, గుంజన్ సక్సెనా: ద కార్గిల్ గర్ల్, గుడ్‌లక్ జెర్రీ చిత్రాలు ఓటీటీలోనే విడుదలయ్యాయి. ఇప్పుడు నాలుగో చిత్రంగా ‘బవాల్’ కూడా ఈ లిస్ట్‌లో చేరింది. దీంతో ఆమెను బాలీవుడ్ ఓటీటీ స్టార్‌గా చెప్పుకుంటున్నారు. ఇక తను హీరోయిన్‌గా నటించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ ఆఫీసర్‌గా ఆమె నటిస్తున్న ‘ఉలజ్’ చిత్రం ఇటీవలే లండన్‌లో ప్రారంభమైంది. మరి రాబోయే చిత్రాలైనా థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి.. ఓటీటీ స్టార్ ట్యాగ్‌ని తీసేస్తాయేమో చూడాలి!