9 డెలివరీ అవుట్‌‌ లెట్లను ఏర్పాటు బీబీకే

9 డెలివరీ అవుట్‌‌ లెట్లను ఏర్పాటు బీబీకే

హైదరాబాద్, వెలుగు: బిర్యాని, కబాబ్‌‌లను డెలివరీ చేసే బిర్యాని బై కిలో (బీబీకే) హైదరాబాద్‌‌లో మరో 9 డెలివరీ అవుట్‌‌ లెట్లను ఏర్పాటు చేసింది. ఇందులో ఒక డైన్‌‌ ఇన్‌‌ అవుట్‌‌లెట్‌‌ కూడా ఉంది. బిర్యాని క్యాపిటల్‌‌గా పేరొందిన హైదరాబాద్‌‌లో బిర్యాని మార్కెట్ సైజు  రూ. రెండు వేల కోట్లుగా ఉంటుందని కంపెనీ ఓ స్టేట్‌‌మెంట్‌‌లో పేర్కొంది.

 హైదరాబాద్‌‌లోని కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని, ఇంకో ఏడాదిలో సిటీలో అందరూ మెచ్చే బిర్యాని, కబాబ్‌‌ బ్రాండ్‌‌గా మారుతామని కంపెనీ సీఈఓ విశాల్‌‌ జిందాల్ అన్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రెవెన్యూలో హైదరాబాద్ మార్కెట్ వాటా 15–20 శాతానికి పెంచుకోవాలని టార్గెట్‌‌గా పెట్టుకున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌‌, లక్నో, కోల్‌‌కతా, గుంటూరు..ఇలా నాలుగు రకాల్లో  ధమ్‌‌ హండి బిర్యాని అందిస్తున్నామని అన్నారు.