
జన్నారం, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోపాటు విద్య, ఉద్యోగాలు, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లను కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఆదివారం జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సంఘం ఆదిలాబాద్ జిల్లా కో కన్వీనర్ కడార్ల నర్సయ్య, మంచిర్యాల జిల్లా కన్వీనర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చేపట్టిన యద్ధబేరి కార్యక్రమానికి మద్దతుగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. బీసీ సంఘం నాయకులు సంద గోపాల్, పురుషోత్తం, రాగుల శంకర్, రాజన్న, విజయ్, భూమాచారి తదితరులు పాల్గొన్నారు.