చేనేత కార్మికులకు అండగా ఉంటా : రాపోలు జయప్రకాశ్

చేనేత కార్మికులకు అండగా ఉంటా :  రాపోలు జయప్రకాశ్
  • బీసీ కమిషన్ సభ్యుడు రాపోలు జయప్రకాశ్​

చండూరు, వెలుగు : చేనేత కార్మికులు, పద్మశాలి కుటుంబాలకు అండగా ఉంటానని బీసీ కమిషన్ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత రాపోలు జయప్రకాశ్ అన్నారు. ఆదివారం చండూరులో  చేనేత పరిరక్షణ సేవా సమితి (సీపీఎస్), పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ద్వితీయ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తన స్వగ్రామానికి అన్ని విధాలా సేవలందిస్తానని తెలిపారు. చేనేత సమస్యలను ఇప్పటికే అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నానని తెలిపారు. అనంతరం జయప్రకాశ్​ను ఘనంగా సన్మానించారు. 

కార్యక్రమంలో పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు గుర్రం భిక్షమయ్య, గౌరవ అధ్యక్షుడు పులిపాటి ప్రసన్న, ప్రధాన కార్యదర్శి గంజి శ్రీనివాస్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు, కాంగ్రెస్ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు దేవా, మార్కండేయ ఆలయ మాజీ అధ్యక్షుడు పున్న భిక్షమయ్య , చేనేత పరిరక్షణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాపోలు ప్రభాకర్, అధ్యక్షుడు చెరుపల్లి కృష్ణ, ఉపాధ్యక్షుడు ఏలే  శ్రీనివాస్ నాయకులు పాల్గొన్నారు.