బీసీల రిజర్వేషన్ల కోసం ఐక్యంగా పోరాటం చేద్దాం : పెద్దిరెడ్డి రాజా

బీసీల రిజర్వేషన్ల కోసం ఐక్యంగా పోరాటం చేద్దాం  : పెద్దిరెడ్డి రాజా

సూర్యాపేట, నల్గొండ అర్బన్, వెలుగు:  బీసీల రిజర్వేషన్ల కోసం ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్లో రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు బీసీ ధర్మ దీక్ష కార్యక్రమం నిర్వహించారు.   బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, ఎన్డీఏ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచాలని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ చక్రహరి రామరాజు డిమాండ్ చేశారు. 

 నల్గొండ లోని గడియారం సెంటర్లో బీసీ ధర్మ పోరాట దీక్షలో ఆయన మాట్లాడుతూ..  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు.  రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో బీసీ నాయకులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.