సీట్ల కోటా విషయంలో తగ్గేదే లే అంటున్న బీసీ లీడర్లు

సీట్ల కోటా విషయంలో తగ్గేదే లే అంటున్న బీసీ లీడర్లు

సీట్ల కోటా విషయంలోనూ తగ్గేదే లే అంటున్నారు కాంగ్రెస్​లోని బీసీ లీడర్లు. తాడోపేడో తేల్చుకునేందుకూ సై అంటున్నారు. హైకమాండ్​కు లాయల్​గా ఉంటూనే ఫైట్​చేస్తామంటున్నారు. పార్టీకి విధేయులుగా ఉంటూనే బీసీ లీడర్లంటే ఏందో చూపించేందుకు సిద్ధమవుతున్నారట. ఇచ్చిన మాట ప్రకారం ఒక్కో లోక్​సభ పరిధిలో రెండు సీట్లను ఇవ్వాల్సిందేనంటున్నారు. అంతేకాదు.. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీనే కాబట్టి, కాంగ్రెస్​ను గెలిపించాలంటూ ప్రజలను పార్టీ నేతలు రిక్వెస్ట్​ చేస్తున్నప్పుడు.. తమ కోటా కోసం కొట్లాడితే తప్పేందని అంటున్నారు. 

బీసీల ఓట్లు లేనిదే ఏ పార్టీ గెలిచే పరిస్థితి లేదని తేల్చి చెప్తున్నారు. బీసీలు ఎక్కువున్నప్పుడు పతార ఎక్కువున్న బీసీ లీడర్లకు టికెట్లు ఇచ్చి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. నల్గొండ నుంచి టికెట్​ఆశిస్తున్న చెరుకు సుధాకర్​ ఈ సారి టికెట్​ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. కాంగ్రెస్​సహా ఏ పార్టీలోనూ బీసీలకు న్యాయం జరగడం లేదని ఆయన బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. తన పార్టీని విలీనం మాత్రమే చేశానని, పార్టీ సిద్ధాంతాలు ఇంకా సజీవంగానే ఉన్నాయని ఆయన చెప్తున్నారు. కొన్ని స్థానాలు, కొన్ని విషయాలకు సంబంధించి పార్టీలో లీకులు ఎక్కువైపోతున్నాయని, ఆ లీకువీరులెవరో అందరికీ తెలుసని అంటున్నారు. ‑ వెలుగు, హైదరాబాద్​