బాసర ఐఐఐటీలో సీట్లు సాధించిన బీసీ గురుకుల విద్యార్థులు

బాసర ఐఐఐటీలో సీట్లు సాధించిన బీసీ గురుకుల విద్యార్థులు
  • అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్, సెక్రటరీ సైదులు

హైదరాబాద్ , వెలుగు: మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల పాఠశాలలో చదివి బాసర ఐఐఐటీలో సీటు సాధించిన విద్యార్థులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ వెల్ఫేర్ సెక్రటరీ శ్రీధర్,  బీసీ గురుకుల సెక్రటరీ  సైదులు అభినందించారు.ఈ ఏడాది పదో తరగతి, ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు అత్యుత్తమ విద్యాసంస్థల్లో సీట్లు సాధించడం ఆనందంగా ఉందని చెప్పారు.  బీసీ గురుకుల విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశం కోసం అవసరమైన శిక్షణను అందిస్తున్నామని శనివారం విడుదల చేసిన ప్రకటనలో మంత్రి పొన్నం ప్రభాకర్, సెక్రటరీ సైదులు తెలిపారు. 

అయితే, చార్మినార్ బీసీ గురుకుల బాలికల పాఠశాలలో పదోతరగతి చదివిన దేవికా నందిని, రామగుండం నుంచి శ్రీతేజ,  నిజామాబాద్ జిల్లా నుంచి జయశ్రీ, ప్రవీణ, ఎం. అరవింద్, నవాబ్ పేట నుంచి కె. జగదీష్, జె. రవి, ఖానాపూర్ నుంచి లిప్సా, సంగారెడ్డి జిల్లా నుంచి ఎం. అశ్విని, కె. ప్రసన్న, కరీంనగర్ జిల్లా ఆర్. సిరి, జె. రామేశ్వరి, మోక్షిత్, శీను నాయక్, శ్రీ చరణ్, సిహెచ్ విజయకుమార్, వంశీకృష్ణ, మెదక్ నుంచి నవ్యశ్రీ, జాగృతి మరికొందరు విద్యార్థులు ఐఐఐటీ బాసరకు ఎంపిక కావడం అభినందనీయం అన్నారు .