Sep 19 New Movies: ఈ వీకెండ్ థియేటర్/ ఓటీటీ సినిమాలివే.. సెప్టెంబర్ 19న ఒక్కరోజే 15కి పైగా మూవీస్

Sep 19 New Movies: ఈ వీకెండ్ థియేటర్/ ఓటీటీ సినిమాలివే.. సెప్టెంబర్ 19న ఒక్కరోజే 15కి పైగా మూవీస్

ఆడియన్స్ థియేటర్ సినిమాలతో పాటుగా ఓటీటీ మూవీస్ సైతం చూసేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి వారం వచ్చే కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. రేపు శుక్రవారంతో (సెప్టెంబర్ 19) వీకెండ్ మొదలవ్వనుంది. థియేటర్స్లో తెలుగులో 5 సినిమాల వరకు రానున్నాయి. అయితే, ఇవాళ (సెప్టెంబర్ 18న) ఒక్కరోజే ఓటీటీలో 8 సినిమాలు వచ్చి ఆడియన్స్లో ఆసక్తి పెంచాయి. ఈ క్రమంలోనే థియేటర్/ఓటీటీ సినిమాలు ఏంటనేది లుక్కేయడం షురూ చేశారు ఆడియన్స్. మరి  సినిమాలేంటో చూసేయండి!

థియేటర్ సినిమాలు:

ఈ వీకెండ్లో విజయ్ ఆంటోనీ నటించిన ‘భద్రకాళి’ ఇంట్రెస్టింగ్గా ఉండనుంది. ఇది పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కింది. రేపు శుక్రవారం తెలుగు థియేటర్స్లో సైతం విడుదల కానుంది.

అలాగే, మంచు లక్ష్మీ లీడ్ రోల్‌‌‌‌లో వంశీ కృష్ణ మల్లా దర్శకుడిగా మోహన్ బాబు నిర్మించిన చిత్రం ‘దక్ష’. ఈ మూవీ కూడా రేపే (సెప్టెంబర్ 19న) విడుదల కానుంది. ఇక ఈ మూవీస్తో పాటుగా అంకిత్ కొయ్య, నీలఖి జంటగా ఎస్ఎస్ వర్ధన్ తెరకెక్కించిన ‘బ్యూటీ’ కూడా రేపే రానుంది.

అధర్వ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన తమిళ క్రైమ్ డ్రామా 'టన్నెల్' తెలుగు వెర్షన్ రేపు సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది. వీటితో పాటుగా అక్షయ్ కుమార్ జాలీ LLB 3 కోర్ట్‌రూమ్ డ్రామా కూడా విడుదల కానుంది. 

ఓటీటీ సినిమాలు:

నెట్‌ఫ్లిక్స్:

ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ (తెలుగు డబ్బింగ్ హిందీ యాక్షన్ కామెడీ డ్రామా సిరీస్)- సెప్టెంబర్ 18

సేమ్ డే విత్ సమ్‌వన్ (థాయ్ టైమ్ లూప్ రొమాంటిక్ డ్రామా)- సెప్టెంబర్ 18

బ్లాక్ రాబిట్ (ఇంగ్లీష్ క్రైమ్ మిస్టరీ డ్రామా)- సెప్టెంబర్ 18

ప్లాటోనిక్ బ్లూ మూన్ హోటల్ (టర్కీష్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 18

ఈటీవీ విన్:

ప్రేమ ఇష్క్ కాదల్ (తెలుగు రొమాంటిక్ కామెడీ)- సెప్టెంబర్ 18

అమెజాన్ ప్రైమ్:

బెలెన్ (స్పానిష్ లీగల్ కోర్ట్ రూమ్ డ్రామా)- సెప్టెంబర్ 18

జియో హాట్‌స్టార్:

సిన్నర్స్ (ఇంగ్లీష్ హారర్ యాక్షన్ థ్రిల్లర్)- సెప్టెంబర్ 18

చౌపల్:

దారు పీండ హోవే (పంజామీ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- సెప్టెంబర్ 18

ఈ సినిమాల లిస్ట్లో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డైరెక్ట్ చేసిన సీరీస్ ఉండటం విశేషం. అదే 'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్'. తెలుగులో కూడా స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు తెలుగులో 'ప్రేమ ఇష్క్ కాదల్' కూడా ఉంది. వీటితో పాటుగా సిన్నర్స్, బ్లాక్ రాబిట్ సినిమాలు స్పెషల్గా ఉండనున్నాయి.

ఇకపోతే.. ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్: బాలీవుడ్ ఇండస్ట్రీపై సెటైరికల్ సిరీస్గా తెరకెక్కింది. ఇందులో లక్ష్య, సహేర్ బంబా ప్రధాన పాత్రల్లో నటించారు. బాబీ డియోల్, మనోజ్ పహ్వా, రజత్ బేడి, గౌతమి కపూర్, మనీష్ చౌదరి కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్లో షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్, కరీనా కపూర్, రణ్‌వీర్ సింగ్ వంటి బాలీవుడ్ దిగ్గజాలు గెస్ట్ రోల్ ప్లే చేశారు.