పట్టు వదలని బీసీసీఐ... టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్

పట్టు వదలని బీసీసీఐ... టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్

నిన్నటి వరకు బీసీసీఐ టీమిండియా హెడ్ కోచ్ ను వెతికే పనిలో ఉంది. ఈ క్రమంలో ఎవర్ని ఎంపిక చేయాలో సతమతమైంది. ఒకప్పుడు టీమిండియా హెడ్ కోచ్ అంటే ఎగబడిపోయేవారు. భారీ ఎత్తున దరఖాస్తులు వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయినట్లుగానే కనిపిస్తున్నాయి. పిలిచి మరీ ఆఫర్ ఇస్తున్నా వెనకడుగేస్తున్నారు. తాజాగా భారత జట్టు టీ 20 హెడ్ కోచ్ ఆఫర్ ను భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా తిరస్కరించాడు. దీంతో ఇప్పుడు బీసీసీఐ ద్రవిడ్ ను  మరోసారి కోచ్ గా నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 

2024లో జరిగే టీ20 ప్రపంచకప్ వరకు టీమిండియా ప్రధాన కోచ్‌గా కొనసాగేందుకు రాహుల్ ద్రవిడ్‌ పదవీకాలాన్ని బీసీసీఐ పొడిగించింది. జట్టుతో ద్రవిడ్ బాగాకలిసిపోవడమే కాక.. ద్రవిడ్ పనితీరు బీసీసీఐకు బాగా నచ్చింది. అయితే ద్రవిడ్ కోచ్ పదవిపై ఆసక్తి చూపించకపోయినా బీసీసీఐ విజ్ఞప్తి మేరకు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. కోచ్ గా ద్రవిడ్ రెండేళ్ల కాలంలో ఐసీసీ టోర్నీలకు సంబంధించి రెండుసార్లు ఫైనల్స్‌కు, ఒకసారి సెమీస్‌కు జట్టును తీసుకెళ్లాడు. ఆసియా కప్‌లో విజేతగా నిలిపాడు.

ద్రవిడ్ తో పాటు విక్రమ్ రాథోడ్ బ్యాటింగ్ కోచ్ గా, పరాస్ మహాంబర్ బౌలింగ్ కోచ్ గా, టీ. దిలీప్ ఫీల్డింగ్ కోచ్ గా యధావిధిగా తన స్థానాల్లో కొనసాగనున్నారు. వెస్టిండీసీ, అమెరికా వేదికగా 2024 జూన్ లో టీ 20 ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో ఈ మెగా టోర్నీకి టీమిండియా హెడ్ కోచ్ ఎవరనే విషయంలో బీసీసీఐ సతమతమైన సంగతి తెలిసిందే. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ను విజయవంతంగా నడిపిన అనుభవం నెహ్రాకు ఉంది.      

Also Read:-దక్షిణాఫ్రికా సిరీస్‌కు కోహ్లీ దూరం.. మరి రోహిత్ పరిస్థితి ఏంటి..?

2022, 2023 గుజారాత్ జట్టుకు కోచ్ గా పని చేసిన నెహ్రా.. 2022 లో హార్దిక్ సేన ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతో కీల పాత్ర పోషించాడు. ఇక ఈ ఏడాది జరిగిన గుజరాత్ ను ఐపీఎల్ ఫైనల్ కు చేర్చాడు. ఈ నేపథ్యంలో నెహ్రా టీ 20 కోచ్ కు సరైన వాడిగా బీసీసీఐ భావిస్తే ఈ మాజీ భారత బౌలర్ మాత్రం నో చెప్పేశాడు. 2024 టీ 20 ప్రపంచ కప్ తర్వాత ద్రవిడ్ కోచ్ పదవికి గుడ్ బై చెప్పే అవకాశముంది.