IND v AFG: కోహ్లీ, రోహిత్ వచ్చేశారు.. ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌‌కు భారత జట్టు ఇదే

IND v AFG: కోహ్లీ, రోహిత్ వచ్చేశారు.. ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌‌కు భారత జట్టు ఇదే

ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు టీ20 సిరీస్ లో భాగంగా భారత జట్టును ప్రకటించారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మందితో కూడిన భారత స్క్వాడ్ ను ప్రకటించింది. దాదాపు 14 నెలల తర్వాత టీమిండియా స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20లు ఆడేందుకు సిద్ధమయ్యారు. 2022 టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కు దూరంగా ఉంటూ వస్తున్న ఈ ద్వయం.. 2024 టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని సెలక్ట్ చేశారని అర్ధమవుతుంది. రోహిత్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తాడు.  

స్టార్ పేసర్లు బుమ్రా, సిరాజ్ లకు ఈ సిరీస్ నుంచి రెస్ట్ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. గాయాలతో ఇబ్బందిపడుతున్న హార్దిక్ పాండ్య, సూర్య కుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్ ఈ సిరీస్ కు దూరమయ్యారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్ లో అదరగొట్టిన రింకూ సింగ్, ముఖేష్ కుమార్, తిలక్ వర్మ తమ స్థానాలను నిలుపుకోగా..ఫామ్ లో ఉన్న సంజు శాంసన్ కు అవకాశం దక్కింది. కిషాన్, శ్రేయాస్ అయ్యర్ లకు 15 మంది స్క్వాడ్ లో స్థానం దక్కలేదు. ఇదిలా ఉండగా స్టార్ ఆల్ రౌండర్ జడేజాకు అవకాశం దక్కకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.   

మూడు టీ20 ల సిరీస్ లో భాగంగా జనవరి 11 న మొహాలీలో తొలి టీ20, 14 న ఇండోర్ లో రెండో టీ20, 17న బెంగళూరులో మూడో టీ20 జరుగుతాయి. ఇక నిన్న(జనవరి 6) ఆఫ్ఘనిస్తాన్‌ 19 మంది స్క్వాడ్ తో జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే.   

భారత్ స్క్వాడ్     

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, డబ్ల్యూ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ , అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్