
న్యూఢిల్లీ: ఎలైట్ ప్యానెల్ అంపైర్ల విషయంలో బీసీసీఐ మరో అడుగు ముందుకేసింది. ఇన్నాళ్లూ స్టార్ క్రికెటర్లకే ఉన్న ఏ+ గ్రేడ్‌ను అంపైర్లకూ వర్తింప చేసింది. ఈ మేరకు ఇటీవల జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్నేషనల్ అంపైర్లు నితిన్ మీనన్, అనిల్ చౌదరి, మదన్‌గోపాల్ జయరామన్, వీరేందర్ కుమార్ శర్మ, కేఎన్ అనంతపద్మనాభన్, రోహన్ పండిట్, నిఖిల్ పట్వర్ధన్, సదాశివ్ అయ్యర్, ఉల్లాస్ గాంధీ, నవ్‌దీప్ సింగ్ ఈ కేటగిరీలో ఉన్నారు. షంషుద్దీన్‌తో సహా మరో 20 మంది గ్రూప్–ఎలో ఉన్నారు. గ్రూప్–బిలో 60, గ్రూప్–సిలో 46, గ్రూప్–డిలో 11 మంది అంపైర్లకు చోటు కల్పించారు. ఏ+, గ్రూప్–ఎలో ఉన్న అంపైర్లకు ఒక్కో మ్యాచ్‌కు రూ. 40 వేలు, బి, సి గ్రూప్‌లో ఉన్న వారికి రూ. 30 వేలు చెల్లించనున్నారు.