వాఘా బోర్డర్‌‌‌‌ మీదుగా పాక్‌‌‌‌కు బీసీసీఐ బాస్‌‌‌‌!

వాఘా బోర్డర్‌‌‌‌ మీదుగా పాక్‌‌‌‌కు బీసీసీఐ బాస్‌‌‌‌!

ముంబై:  బీసీసీఐ ప్రెసిడెంట్‌‌‌‌ రోజర్‌‌‌‌ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా పాకిస్తాన్‌‌‌‌ వెళ్లనున్నారు. ఈ నెల 30 నుంచి జరిగే ఆసియా కప్‌‌‌‌ నేపథ్యంలో పాక్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ బోర్డు ఆహ్వానం మేరకు బోర్డు తరఫున ఈ ఇద్దరు లాహోర్‌‌‌‌ వెళ్లి అధికారిక విందులో పాల్గొనబోతున్నారు. 2008లో  ముంబైపై ఉగ్రదాడుల తర్వాత ఇండో–పాక్‌‌‌‌  ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత బీసీసీఐ ప్రతినిధులు పాక్‌‌‌‌ వెళ్లడం ఇదే తొలిసారి కానుంది. ఆసియా కప్‌‌‌‌నకు శ్రీలంకతో కలిసి ఆతిథ్యం ఇస్తున్న పాక్‌‌‌‌ టోర్నీలో పాల్గొనే అన్ని దేశాల ప్రతినిధులకు ఆహ్వానం పంపించింది. 

ఈ క్రమంలో ఈ నెల 15న పీసీబీ మేనేజింగ్‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌ జుకా అష్రఫ్‌‌‌‌ నుంచి బీసీసీఐకి అధికారిక ఆహ్వానం అందింది. బీసీసీఐతో పాటు అన్ని దేశాల బోర్డులకు చెందిన టాప్‌‌‌‌ మెంబర్స్‌‌‌‌ పీసీబీ విందుకు హాజరయ్యేందుకు అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. శ్రీలంకలోని పల్లెకెలెలో సెప్టెంబర్‌‌‌‌ 2న ఇండియా–పాకిస్తాన్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌కు హాజరై వచ్చిన ఒకటి రెండు రోజుల తర్వాత   వాఘా సరిహద్దు మీదుగా రోడ్డు మార్గంలో  రోజర్ బిన్నీ, రాజీవ్ శుక్లా లాహోర్ చేరుకోనున్నారు.  రెండు రోజులు అక్కడే ఉండనున్న ఈ ఇద్దరు  సెప్టెంబర్‌‌‌‌ 3 లేదా 5న గడాఫీ స్టేడియంలో ఓ మ్యాచ్‌‌‌‌కు హాజరుకానున్నారు. లాహోర్ లోని గవర్నర్ హౌస్ లో సెప్టెంబర్ 4న అన్ని దేశాల ప్రతినిధులకు అధికారిక విందు  ఏర్పాటు చేశారు.