
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం అసోంలోని బ్రహ్మపుత్ర క్రాకర్ అండ్ పాలిమర్ లిమిటెడ్(బీసీపీఎల్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు ఆఖరు తేదీ జూన్ 17.
పోస్టుల సంఖ్య: 27
పోస్టులు: సీనియర్ ఇంజినీర్(కాంట్రాక్ట్ అండ్ ప్రొక్యూర్మెంట్) 15, సీనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) 01, సీనియర్ ఇంజినీర్(ఇనుస్ట్రుమెంటేషన్) 03, సీనియర్ ఇంజినీర్(ఐటీ) 01, సీనియర్ ఇంజినీర్ (మెకానికల్) 01, సీనియర్ ఆఫీసర్ (కాంట్రాక్ట్ అండ్ ప్రొక్యూర్మెంట్) 03, సీనియర్ ఆఫీసర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) 02, సీనియర్ ఆఫీసర్ (మార్కెటింగ్) 01, ఆఫీసర్ (ల్యాబొరేటరీ), 01, డిప్యూటీ జనరల్ మేనేజర్ 01.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ/ ఐసీడబ్ల్యూఏ, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: మే 18
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600.
లాస్ట్ డేట్: జూన్ 17.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.