
వర్షాకాలం వచ్చింది అంటే.. రెగ్యులర్ గా కారును బయటకు తీయని వారు.. వానలతో కారును ఉపయోగిస్తూ ఉంటారు. అదే విధంగా రెగ్యులర్ గా కారు ఉపయోగించే వారూ ఉంటారు. వానాకాలంలో మీ కారును ఫుల్ కండీషన్ లో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే భారీ వర్షంలో అగినా.. వరదల్లో నిలిచిపోయినా ప్రమాదాన్ని కొని తెచ్చుకోవటమే. అంతే కాదు.. ఎంతో విలువైన మీ కారు రిపేర్ల కోసం అధిక మొత్తంలో డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది. సో.. ముందుగానే మీ కారు కండీషన్ ను.. వర్షాకాలంలో ఈ విధంగా చెక్ చేసుకోండి.
ఎయిర్ కండీషన్ :
వర్షాకాలంలో కారు ఏసీ అనేది ఎంతో ముఖ్యం. బయట వాన పడుతున్నప్పుడు క్లాస్ దింపి జర్నీ చేయలేం. ఏసీలోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సో.. ఏసీ అనేది కండీషన్ లో ఉంచుకోవటం చాలా ముఖ్యం. అదే విధంగా క్లాసులు సరిగా పని చేస్తున్నాయా లేదా అనేది చూసుకోండి.
లీక్స్ లేకుండా చూసుకోవాలి :
మిగతా రోజులతో పోల్చితే వర్షాకాలంలో మీరులో లీక్స్ లేకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. లీక్స్ ఉన్నట్లయితే నీళ్లు లోపలికి వచ్చేస్తాయి. దీని వల్ల కారు మొత్తం పాడయ్యే ప్రమాదం ఉంది. కారు కింద, పై భాగంతోపాటు.. గ్లాసులు, డోర్స్ దగ్గర లీక్స్ లేకుండా చూసుకోవాలి.
టైర్లు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి :
వేసవిలో విపరీతమైన ఉష్ణోగ్రతలను తట్టుకుని, వర్షాకాలంలోకి ప్రవేశించే ముందు టైర్ల పని తీరు చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ సీజన్ లో ఎడతెరపి లేకుండా వర్షాల భారీ నుంచి తప్పించుకోవడానికి, రోడ్డుపై ఉన్న వరదను దాటుకుని వెళ్లేందుకు కావాల్సిన మెయింటెనెన్స్ చేయాలి. అందుకు ట్రెడ్ డెప్త్ ను ఎప్పటికప్పుడు చెక్ చేయడం చాలా మంచిది.
అరిగిపోయిన వైపర్ బ్లేడ్ లను తీసేయాలి :
వేసవిలో ఎక్కువ సూర్యరశ్మి కారణంగా కారు వైపర్ లపై ఉన్న రబ్బర్ బ్లేడ్ లు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇవి బయటి వాతావరణాన్ని చూపించడంలో ఇబ్బంది కలిగించడమే కాకుండా, విండ్ షీల్డ్ పై గీతలు పడేటట్టు చేస్తాయి. అందువల్ల వర్షాకాలం ప్రారంభానికి ముందే వీటిని రీప్లేస్ చేయడం చాలా అవసరం.
బ్రేకింగ్ సిస్టమ్ ను క్షుణ్ణంగా పరిశీలించాలి :
ఈ వర్షాకాలంలో కారు బ్రేకింగ్ సిస్టమ్ అదనపు శ్రద్ధ అవసరం. బ్రేకింగ్ పని తీరును మెరుగుపరచడానికి అరిగి పోయిన బ్రేక్ ప్యాడ్స్, బ్రేక్ రోటర్ లను మార్చడం మంచిది. ఈ ముందు జాగ్రత్త చర్య కారులో ప్రయాణిస్తున్న వారికే కాకుండా.. రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికుల భద్రతకు దోహదం చేస్తుంది.
వర్షాకాలంలో కారు పని తీరును ఎందుకు చెక్ చేయాలంటే..
వేసవిలో అదనపు అరుగుదల కారణంగా కార్లను వర్షాకాలానికి ముందే తనిఖీ చేసుకోవాలి. పైన తెలిపిన చిట్కాలను పాటిస్తే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సురక్షితమైన, ఆనందదాయకమైన ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. దీని వల్ల మిమ్మల్ని మీరు రక్షించుకోవడమే కాకుండా.. ఇతరులనూ రక్షించిన వారవుతారు.