Good Health : వర్షాలు పడుతున్నాయి.. జర పైలం.. జలుబు, జ్వరం రాకుండా జాగ్రత్తలు ఇలా..!

Good Health : వర్షాలు పడుతున్నాయి.. జర పైలం.. జలుబు, జ్వరం రాకుండా జాగ్రత్తలు ఇలా..!

రోజులు సాఫీగా సాగిపోతున్నప్పుడు మధ్యలో ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తే.. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. రోజువారి పనులు, తినే ఆహారం, చేసే వ్యాయామంలో ఎలాంటి మార్పు ఉండదు. అయినా ఉన్నట్టుండి ఏదో ఒక అనారోగ్య సమస్య వచ్చి పడుతుంది. ఇలా సడన్గా వచ్చే వ్యాధులకు కారణం సీజన్ చేంజ్. 

ఒక సీజన్ అయిపోయి మరో సీజన్ వచ్చేటప్పుడు వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల వ్యాధులు త్వరగా వ్యాపిస్తాయి. ఇప్పుడు మనం ఆ సీజన్లోనే ఉన్నాం. జూన్ మొదలయింది. ఇప్పుడిప్పుడే ఎండలు తగ్గుముఖం పడుతున్నాయి. వర్షాకాలం రాబోతుంది. ఇలాంటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. 

వానాకాలం తీసుకొచ్చే ఇబ్బందులూ అన్నీ ఇన్నీ కావు. 6 చెరువులు, కాలువల్లోకి వాన నీళ్లు చేరతాయి. ఆ నీళ్లు నిల్వ " ఉన్న చోటే దోమలు కూడా పెరుగుతాయి. దోమలు గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. దోమలెక్కడ ఉంటే అక్కడ వ్యాధులుంటాయి. ఇంటి పరిసరాలను ఎంత శుభ్రంగా ఉంచుకున్నా ఈ కాలంలో దోమల నుంచి తప్పించుకోవడం కుదరని పని. దోమల వల్ల ముఖ్యంగా వచ్చే జ్వరాలు.. డెంగ్యూ, టైఫాయిడ్.

డెంగూ

డెంగ్యూ టైగర్ మస్కిటో వల్ల వస్తుంది. వానాకాలం ఈ దోమలు బాగా పెరుగుతాయి. అందుకే జూన్ నెలలో ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, చర్మం మీద దద్దుర్లు, జ్వరం లాంటివి వచ్చినట్టు గమనిస్తే.. "వైరల్ ఇన్ఫెక్షన్ అయి ఉంటుందిలే' అనుకోకుండా వెంటనే చెక్ చేయించుకోవాలి. సీజన్ మారేటైంలో ఎంత చిన్న జ్వరాన్నైనా తేలిగ్గా తీసిపారేయకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే మెదడులో రక్తస్రావం, రక్తనాళాలు దెబ్బతినటం, కాలేయం పెద్దదవటం లాంటి పరిస్థితులు తలెతొచ్చు.

 జాగ్రత్తలు

  •  డెంగ్యూ జ్వరానికి వ్యాక్సిన్ లేదు. కాబట్టి ఈ జ్వరం రాకుండా ఉండాలంటే, దోమలకు దూరంగా ఉండడం ఒక్కటే మార్గం. అందుకే
  •  ఇంటి పరిసరాల్లో దోమలు పెరిగే అవకాశం లేకుండా చూసుకోవాలి.
  •  ఒంటిని పూర్తిగా కప్పుతూ బట్టలు వేసుకోవాలి. పడుకునేటప్పుడు దోమల మందు, లేదా దోమతెరలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. దోమలు రాకుండా కిటికీలు, తలుపులకు మెష్ లు పెట్టాలి.

టైఫాయిడ్

వానాకాలం కనిపించే మరో జ్వరం టైఫాయిడ్, 'సాల్మనొల్లా టై'పై' అనే బ్యాక్టీరియాతో వ్యాపిస్తుంది. శుభ్రంగా లేని ఆహారం, నీళ్ల ద్వారా ఇది వ్యాపిస్తుంది. అందులోనూ ఈ బ్యాక్టీరియా సోకిన మూడు వారాల తర్వాతే లక్షణాలు కనిపిస్తాయి. అందుకే కొద్దిగా జ్వరం, తలనొప్పి, కడుపు నొప్పి లాంటివి గమనించినా వెంటనే బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి.

 జాగ్రత్తలు

  •   చేతులను తరచుగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఆహారం తినేముందు, తిన్న తర్వాత తప్పనిసరిగా సబ్బునీళ్లతో చేతులు శుభ్రం చేసుకోవాలి. వీలైతే హ్యాండ్ శానిటైజర్ దగ్గర ఉంచుకోవాలి.
  • ఫా వేడిచేసి చల్లార్చిన నీరు తాగాలి. స్నానం
  • చేసేటప్పుడు, బ్రష్ చేసేటప్పుడు పొరపాటున కూడా నీళ్లు మింగకూడదు.
  •   కూరగాయలు కూడా గోరువెచ్చని నీటిలో కడిగి వాడాలి. ఆకుకూరలను మరింత ఎక్కువగా కడుక్కొని వండుకోవాలి
  •   అప్పటికప్పుడు వండుకున్న వేడి పదార్థాలే తినాలి. బయటి ఆహారం పూర్తిగా మానేయటం మంచిది.

శ్వాసకోశ సమస్యలు

వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దాంతో వైరస్లు బ్యాక్టీరియాలు మరింత తేలికగా వ్యాపిస్తాయి. అందుకే జలుబు, దగ్గు లాంటివి సీజన్ చేంజ్ అప్పుడు బాగా వస్తుంటాయి. అందుకే సీజన్లో పాటే ఆహార అలవాట్లు కూడా మార్చుకోవాలి. 

 జాగ్రత్తలు

ఫా ముఖ్యంగా ఈ టైంలో విటమిన్-సి పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. చల్లని నీరు, చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలి.
తగినంత నిద్ర అవసరం. పోషకాహారం తీసుకోవాలి. వీలైనంత ఎక్కువ ద్రవాహారం తీసుకోవాలి. చల్లని గాలి, నీరు ముక్కులోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలి.

కళ్ల చర్మ ఇన్ఫెక్షన్లు

సీజన్ మారేటప్పుడు తరచుగా కళ్ల, చర్మ ఇన్ఫెక్షన్లు వస్తాయి. వాతావరణంలో పెరిగే తేమ వల్ల కళ్లకలక, కళ్లు పొడిబారటం, కార్నియా అల్బర్లు ఈ కాలంలో వస్తాయి. అందుకే మురికి చేతివేళ్లతో కళ్లు ముట్టుకోవద్దు. 

కళ్లకలక లక్షణాలు కనిపించిన వెంటనే కళ్లను శుభ్రమైన నీళ్లతో కడిగి వేడి కాపడం పెట్టాలి. వీలైనంత త్వరగా డాక్టర్ని కలవాలి. కళ్లు ఎర్రబడటం, దురదలు, మంట కనిపిస్తే సొంత వైద్యం మాని డాక్టర్ను కలవాలి. అలాగే చర్మాన్ని కాపాడుకునేందుకు.. వర్షంలో తడవకుండా ఉంటే బెటర్. ఒకవేళ వర్షంలో తడిస్తే ఇంటికి వెళ్లగానే స్నానం చేయాలి.