V6 News

కామారెడ్డి జిల్లాలో వ్యక్తిపై ఎలుగుబంటి దాడి

కామారెడ్డి జిల్లాలో వ్యక్తిపై ఎలుగుబంటి దాడి

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలానికి చెందిన ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. స్కూల్ తండాకు చెందిన దంపతులు సలావత్​మత్తు, నీలాతోపాటు మరో ఇద్దరు శుక్రవారం తెల్లవారుజామను తునికాకు, పొయ్యి కట్టెల కోసం అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలోనే మత్తుపై ఒక్కసారిగా దాడి  చేసింది. 

అతడు భయంతో కేకలు వేయడంతో కొద్ది దూరంలో ఉన్న మిగతా వారు పరుగెత్తుకొని రావడంతో ఎలుగుబంటి  పారిపోయింది. తీవ్ర గాయాలైన ఇతడిని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి సికింద్రాబాద్‎లోని గాంధీ హాస్పిటల్​కు తీసుకెళ్లారు. ఘటనా స్థలాన్ని అటవీశాఖ అధికారులు పరిశీలించారు. ఎంక్వైరీ చేస్తున్నట్లు డీఎఫ్​వో నిఖిత తెలిపారు.