పేరెంట్స్‌పై హీరో విజయ్ కేసు.. నో ప్రాబ్లమ్ అన్న తండ్రి 

V6 Velugu Posted on Sep 20, 2021

చెన్నై: ప్రముఖ హీరో విజయ్ తన తల్లిదండ్రులపై కేసు వేయడం సంచలనంగా మారింది. తన పేరును అనుమతి లేకుండా వాడుతున్నారంటూ తల్లి శోభా చంద్రశేఖర్‌, తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌తోపాటు మరో 11 మందిపై విజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఏడాది కింద విజయ్ మక్కల్ ఇయక్కమ్ పేరుతో ఆయన తండ్రి చంద్రశేఖర్ పేరు పెట్టారు. ఈ పార్టీకి ప్రధాన కార్యదర్శి, కోశాధికారిగా విజయ్ పేరెంట్స్ ఉన్నారు. అయితే ఈ పార్టీకి విజయ్ దూరంగా ఉంటున్నారు.

పార్టీతో తనకు సంబంధం లేదని గతంలోనే విజయ్ క్లారిటీ ఇచ్చారు. కానీ, విజయ్ తల్లిదండ్రులు ఆయన పేరుతో పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని సమాచారం. దీంతో వారిపై విజయ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. రాజకీయ కార్యకలాపాలకు తన పేరును వినియోగించకుండా నిషేధం విధించాలని కోర్టును విజయ్ కోరాడు. ఈ విషయంపై విజయ్ తండ్రి చంద్రశేఖర్ స్పందించారు. సమస్యలు లేని కుటుంబాలు ఉండవని ఆయన అన్నారు. ప్రతి కుటుంబంలోని తండ్రీ కొడుకుల మధ్య మనస్పర్థలు, గొడవలు ఉండటం మామూలేనని.. కొన్నాళ్లకు అవి సమసిపోతాయన్నారు. 

 

Tagged case, Actor Vijay, thalapathy vijay, SA Chandrasekhar, Shobha Chandrasekhar, Vijay Fans Club, Vijay\\\'s Father

Latest Videos

Subscribe Now

More News