స్వీట్లు పంచుకున్న పాక్, ఇండియా సైనికులు

స్వీట్లు పంచుకున్న పాక్, ఇండియా సైనికులు

స్వాతంత్య్ర దినోత్సవ వేళ.. పంజాబ్ అమృత్ సర్ లోని అట్టారీ-వాఘా బోర్డ్ దగ్గర బీటింగ్ రీ ట్రీట్ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమాన్ని చూసేందుకు భారీగా జనం భారీగా తరలివచ్చారు. హిందుస్తాన్ జిందాబాద్, వందేమాతరం నినాదాలతో వాఘా బార్డర్ మార్మోగింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్.. పాకిస్థాన్ రేంజర్స్ చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 1959 నుంచి నిర్వహిస్తున్న ఈ బీటింగ్ రీ ట్రీట్ వేడుకలు.. స్వాతంత్య్ర దినోత్సవాలకు ముందు రోజు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అనంతరం ఇరు దేశాల సైనికులు స్వీట్లు పంచుకొని..ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుకున్నారు 

ఇండియన్ ఆర్మీ పిలుపు..

దేశ వ్యాప్తంగా తిరంగ ర్యాలీలు ఘనంగా జరిగాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఇండియన్ ఆర్మీ వీడియో రిలీజ్ చేసింది. వన్ నేషన్, వన్ ఎమోషన్, వన్ ఐడెంటిటీ అంటూ వీడియో ట్వీట్ చేసింది. ఐక్యత, శక్తి, త్యాగానికి ప్రతీక త్రివర్ణ పతాకం అని ఇండియన్ ఆర్మీ అధికారులు అన్నారు. జాతీయ జెండాను పర్వతాల నుంచి సముద్రాల వరకు గర్వంగా ఎగరవేస్తాం అంటూ ట్వీట్ చేసింది. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని ఇండియన్ ఆర్మీ పిలుపునిచ్చింది.