తిరుమల శ్రీవారి ఆలయంపై నీలి మేఘాలు: అద్బుతాన్ని మైమరిచి వీక్షించిన భక్తులు

తిరుమల శ్రీవారి ఆలయంపై నీలి మేఘాలు: అద్బుతాన్ని మైమరిచి వీక్షించిన భక్తులు

తిరుమల కొండ.. తిరుమల కొండ.. అని పరవశించి పాడుకుంటారు భక్తులు.. తిరుమల కొండపై అణువణువు వేంకటేశ్వరస్వామి మహిమలతో కొలువై ఉంటుందని భక్తుల విశ్వాసం.. కొండపైకి వెళ్లిన భక్తులకు ఠీవీగా కనరిపించే రాజగోపురం తన్మయత్వానికి గురి చేస్తోంది.. అలాంటి కొండపై 2025, ఆగస్ట్ 8వ తేదీ ఉదయం అద్భుతం సాక్షాత్కరించింది. భక్తులను మైమరిపించింది. 

తిరుమల కొండపై నీలి మేఘాలు కమ్మేశాయి. రాజగోపురం మీదుగా కొండ అంతా విస్తరించిన నీలిమేఘాలు భక్తులను కనువిందు చేశాయి. మూడు రోజులుగా పడుతున్న వర్షాలతో కొండపై తెల్లటి మేఘాలు కాశ్మీరీ అందాలను గుర్తు చేశాయి. ఆగస్ట్ 8వ తేదీ ఉదయం మాత్రం మరో విధంగా మేఘాలు భక్తులను ఆకర్షించాయి. నీలి రంగులో మేఘాలు కొండను కొత్త అందాలు తీసుకొచ్చాయి. చాలా చాలా అరుదుగా ఇలాంటి నీలి మేఘాలు కనిపిస్తుంటాయని.. చాలా కాలం తర్వాత రాజగోపురం మీదుగా నీలి మేఘాలు ఆవరించటం అద్భుతం అంటున్నారు భక్తులు. 

ALSO READ : రాఖీ పండుగ : మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు, ద్రౌపది మధ్య ఘటనతో ఇలా పుట్టింది రాఖీ పండుగ..!

తిరుమల కొండపై రాజగోపురం మీదుగా ఆవరించిన ఈ నీలి మేఘాలను భక్తులు ఫొటోలు, వీడియోలు తీయటం కనిపించింది. కొంత మంది సెల్ఫీలతో తమ అనుభవాలను సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. వెంకన్న అద్భుతం.. తిరుమల కొండ మహిమ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.