Beauty Tips: ముఖం ఎప్పుడూ ఫ్రెష్ గా, అందంగా మెరిసిపోవాలా.. ఇంట్లోనే చర్మాన్ని మెరిపించే బ్యూటీ పార్లర్ సీక్రెట్స్ ఇవే !

Beauty Tips: ముఖం ఎప్పుడూ ఫ్రెష్ గా, అందంగా మెరిసిపోవాలా.. ఇంట్లోనే చర్మాన్ని మెరిపించే బ్యూటీ పార్లర్ సీక్రెట్స్ ఇవే !

మెరిసే చర్మం, అందమైన ముఖం ఎవరికి మాత్రం వద్దు చెప్పండి..? అయితే, కేవలం మంచి ఆహారం తింటేనే సరిపోదు.. చర్మానికి పైనుంచి కూడా కాస్త సంరక్షణ అవసరం. ఈ రోజుల్లో బిజీ లైఫ్, పొల్యూషన్ వల్ల ముఖం చాలా త్వరగా అలసిపోయినట్లు మారిపోతుంది. అలాంటి అలసిపోయిన చర్మానికి ఇన్స్టంట్  శక్తిని అందించి, ముడతలు లేని గ్లోయింగ్ స్కిన్‌ను సొంతం చేసుకోవడానికి ఇంట్లోనే పాటించాల్సిన కొన్ని సింపుల్ అండ్ బెస్ట్ స్కిన్ కేర్ టిప్స్ మీకోసం... 

*చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే హెల్దీ ఫుడ్ తో పాటు స్కిన్ కేర్ రొటీన్ ని అలవాటు చేసుకోవాలి. అలిసిపోయిన చర్మాన్ని ఎనర్జిటిక్ గా చేయడానికి ఐస్ క్యూబ్స్ ముఖాన్ని రుద్దాలి. ఇలా చేయడం వల్ల చర్మం కూల్ అవుతుంది.
 
*స్కిన్ ఎసెన్స్.. అంటే వాటర్ బేస్డ్ స్కిన్ కేర్  ప్రొడక్ట్స్ ని రెగ్యులర్ గా వాడాలి. వీటినైతే చర్మం త్వరగా పీల్చుకుంటుంది. వీటిని వాడటం వల్ల చర్మంపై గీతలు పోతాయి. అయితే ఈ ప్రొడక్ట్స్ ని ఎప్పుడూ క్లిన్సింగ్, టోనింగ్ తర్వాతే వాడాలి. మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ కంటే ముందు వీటిని ముఖానికి రాయాలి.

*చిన్న వయసులోనే నుదురు ముడతలు పడుతుంటుంది, గెడ్డం నల్లబడుతుంది, మొటిమలు విపరీతంగా వస్తాయి. అందుకే వీటిని ఇంకాస్త ఎక్కువ జాగ్రత్త చేయాలి. అందుకోసం వారానికోసారి ఫేస్ మాస్క్ వేసుకోవాలి. అయితే స్కిన్ కి నప్పే ఫేస్ ప్యాక్ లని  ఎంచుకోవాలి. అవేం వద్దనుకుంటే ఇంట్లోనే ఫ్రూట్ ఫేస్ ప్యాక్ లు తయారు చేసుకోవచ్చు.

ALSO READ : ముందుకు కాదు రివర్స్ వాకింగ్ చేయండి..

*చర్మాన్ని రిలాక్స్ చేయడానికి షీట్ మాస్క్ లు వాడాలి. అవి మరింత ఎఫెక్టివ్ గా పనిచేయాలంటే ఫేస్ రోలర్ లేదా ఫేస్ మసాజింగ్ టూల్స్ వాడాలి. మాస్క్ తీసేసే పదినిమిషాల ముందు ఫేస్ రోలర్ తో మసాజ్ చేస్తే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇలా చేయడం వల్ల షీట్ మాస్క్ లోని ఇంగ్రెడియెంట్స్ ని చర్మం బాగా పీల్చుకుంటుంది కూడా.

*వారానికి రెండుసార్లు ఫేస్ స్క్రబ్స్ వాడాలి. వీటివల్ల చర్మం ఎక్స్ ఫోలియేట్ అయ్యి చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి. చెమట వల్ల ముఖంపై చేరిన క్రిములు కూడా పోతాయి.