జీవితంలో వెనకడుగు వేస్తే నష్టపోతామని అంటుంటారు. కానీ, ఆరోగ్య విషయంలో మాత్రం వెనకడుగు వేస్తే అద్భుతమైన లాభాలు ఉంటాయని మీకు తెలుసా..? అవును.., మనం రోజు చేసే నడకను కాస్త రివర్స్‌గా.. అంటే వెనక్కి నడిస్తే మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని స్టడీస్ చెబుతున్నాయి.
వెనకడుగు వేయడం అన్ని సందర్భాల్లో చెడు చేయదు. దానివల్ల కూడా లాభాలున్నాయి. ఆశ్చర్యంగా అనిపించినా ఇక్కడ చెప్పేది రివర్స్ వాకింగ్ గురించి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అంటున్నాయి స్టడీలు.
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్టడీ ప్రకారం రివర్స్ వాకింగ్, రన్నింగ్ ని మించిన బెస్ట్ కార్డియో ఎక్సర్సైజ్ మరొకటి లేదు.
వంద అడుగుల రివర్స్ వాకింగ్ వెయ్యి అడుగుల నార్మల్ వాకింగ్ తో సమానం. ఇది బ్రెయిన్ ని యాక్టివ్ చేస్తుంది. అలాగే కాలు వెనక భాగంలో ఉండే మజిల్స్ నార్మల్ వాకింగ్ లో ఇన్వాల్వ్ అవ్వవు. కానీ, రివర్స్ వాకింగ్ లో అన్ని కండరాలు కదులుతాయి. దాంతో కాళ్లు బలంగా అవుతాయి.
రివర్స్ వాకింగ్ వల్ల కండరాలకి బ్లడ్, ఆక్సిజన్ సర్క్యులేషన్ వేగవంతం అవుతుంది. స్టడీల ప్రకారం మోకాళ్ల నొప్పులు, గాయాలతో బాధపడేవాళ్లకు రివర్స్ వాకింగ్ బెస్ట్ ఆప్షన్. రివర్స్ వాకింగ్ వల్ల మోకాళ్లపై ఎక్కువ ఒత్తిడి పడదు. దాంతో ఎన్ని అడుగులేసినా నొప్పుల బాధ ఉండదు. అలాగే రివర్స్ వాకింగ్, రన్నింగ్ వల్ల పాత నొప్పుల నుంచి కూడా రిలీఫ్ ఉంటుంది.
ALSO READ : మీరు జూన్ నెలలో పుట్టారా ? మీ వ్యక్తిత్వం, ప్రేమ, కెరీర్, ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే ?
ప్రతిరోజు పావుగంట రివర్స్ వాకింగ్ చేస్తే వెన్ను నొప్పి తగ్గుతుంది. అలాగే తరచూ ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఒకటిరెండు నెలల్లోనే శరీర బరువులో కూడా తేడా వస్తుంది. గుండె పనితీరు కూడా బాగుంటుంది అంటున్నారు రీసెర్చర్లు. అలాగే రివర్స్ వాకింగ్ వల్ల బ్రెయిన్ కి, బాడీకి మధ్య కో-ఆర్డినేషన్ బాగుంటుంది. మరింకేం ! ఇన్ని లాభాలు ఉన్నప్పుడు వెనకడుగు వేస్తే సరి.
