మీరు మొబైల్ బ్యాంకింగ్ వాడుతున్నారా? అయితే ఇది మీకోసమే..

మీరు మొబైల్ బ్యాంకింగ్ వాడుతున్నారా? అయితే ఇది మీకోసమే..

బ్యాంకింగ్‌‌ యాప్స్‌‌ వాడకంలో జాగ్రత్త!

పాస్‌‌‌‌వర్డ్స్‌‌‌‌ వంటి ఇన్ఫర్మేషన్‌‌‌‌ను ఎవరికీ ఇవ్వొద్దు

సాఫ్ట్‌‌‌‌వేర్లను ఎప్పటికప్పుడు అప్‌‌‌‌డేట్‌‌‌‌ చేయాలి

అన్ని డివైజ్‌‌‌‌లకు యాంటీ వైరస్‌‌‌‌ సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ తప్పనిసరి

నకిలీ యాప్స్‌‌‌‌ జోలికి వెళ్లనే కూడదు

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: కరోనా ఇబ్బందులు మొదలయ్యాక జనం బ్యాంకులకు వెళ్లడాన్ని బాగా తగ్గించారు. బ్యాంకులు కూడా సగం స్టాఫ్‌‌‌‌తో పనిచేస్తున్నాయి.  ఫలితంగా చాలా మంది బ్యాంకింగ్‌‌‌‌యాప్స్‌‌‌‌ వాడటాన్ని మొదలుపెట్టారు. స్టేట్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ యోనో మొబైల్‌‌‌‌ యాప్‌‌‌‌ను రోజుకు 70 వేల మంది డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. యోనో యూజర్ల సంఖ్య 2.7 కోట్లకు చేరిందని స్టేట్ బ్యాంక్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ రజనీశ్​ కుమార్‌‌‌‌ ప్రకటించారు. కరోనా అనంతరం యాప్‌‌‌‌ యూజర్ల సంఖ్య విపరీతంగా పెరిగిందని చెప్పారు. యాప్స్‌‌‌‌ వాడకం చాలా వరకు సేఫ్‌‌‌‌, ఈజీ కూడా. అయితే నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం ఇబ్బందుల్లో పడటం ఖాయం. తొలిసారి బ్యాంకింగ్‌‌‌‌ యాప్స్‌‌‌‌ వాడేవాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

సరైన యాప్‌‌‌‌నే డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసుకోవాలి…

గూగుల్‌‌‌‌ ప్లేస్టోర్‌‌‌‌, యాపిల్‌‌‌‌ యాప్‌‌‌‌ స్టోర్‌‌‌‌లో బ్యాంకులు, యూపీఐల పేరుతో చాలా యాప్స్‌‌‌‌ కనిపిస్తాయి. ఇవన్నీ సంబంధిత కంపెనీలకు చెందినవి కాదు. స్టేట్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ పేరుతో చాలా యాప్స్‌‌‌‌ ఉంటాయి. అందులో నిజంగా బ్యాంకుకు చెందిన యాప్స్‌‌‌‌ కొన్నే ఉంటాయి. మిగతావి థర్డ్‌‌‌‌ పార్టీ యాప్స్‌‌‌‌. బ్యాంకింగ్‌‌‌‌ యాప్స్‌‌‌‌ డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసుకునేముందు, రివ్యూలు చదివి, డెవెలపర్‌‌‌‌ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌ బ్యాంకింగ్‌‌‌‌ కోసం తప్పనిసరిగా రిజిస్టర్‌‌‌‌ చేసుకోవాలి. ఏదైనా మోసం జరిగితే మెసేజ్​ల ద్వారా వెంటనే మనకు తెలుస్తుందని అయామ్‌‌‌‌చీటెడ్‌‌‌‌డాట్‌‌‌‌కామ్‌‌‌‌ సీఈఓ సీఎస్‌‌‌‌ సుధీర్‌‌‌‌ అన్నారు. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో మోసపోయిన వాళ్లు ఈ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ ద్వారా సాయం పొందవచ్చు. బ్యాంకుల అఫీషియల్‌‌‌‌ సైట్ల ద్వారా కూడా యాప్స్‌‌‌‌ డౌన్‌‌‌‌ చేసుకోవచ్చని చెప్పారు. బ్యాంకింగ్‌‌‌‌ యాప్స్‌‌‌‌ డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసుకునే ముందు బ్యాంక్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌తో మాట్లాడి  వివరాలు తెలుసుకోవాలి. నకిలీ బ్యాంకింగ్‌‌‌‌ యాప్స్‌‌‌‌ డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసుకుంటే మన వివరాలన్నీ సైబర్‌‌‌‌ క్రిమినల్స్‌‌‌‌ చేతుల్లోకి వెళ్లిపోతాయి. మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి.

పాస్‌‌‌‌వర్డ్స్‌‌‌‌ను జాగ్రత్తగా ఎంచుకోవాలి

బ్యాంకింగ్‌‌‌‌ యాప్స్‌‌‌‌కు మనం పెట్టుకునే పాస్‌‌‌‌వర్డ్‌‌‌‌ ఎవరూ ఊహించని విధంగా ఉండాలి. మన బర్త్‌‌‌‌డేట్లు లేదా కుటుంబీకుల పేర్లతో పాస్‌‌‌‌వర్డ్‌‌‌‌లు పెట్టుకోకూడదు. ఇలా చేస్తే క్రిమినల్స్‌‌‌‌ పాస్‌‌‌‌వర్డ్‌‌‌‌ను ఛేదించే అవకాశాలు ఉంటాయి. అంచనా వేయడానికి కష్టంగా ఉండే పాస్‌‌‌‌వర్డ్‌‌‌‌ను సెట్‌‌‌‌ చేసుకున్నాక, దానిని ఎక్కడా రాయకూడదు. కావాలంటే ఏదైనా ప్రొటెక్టెడ్‌‌‌‌ ఫైల్‌‌‌‌లో సేవ్‌‌‌‌ చేసుకోవచ్చు. మీ బ్యాంకు అడక్కున్నా, పాస్‌‌‌‌వర్డ్‌‌‌‌లను తరచూ మార్చుతూ ఉండాలి. చాలా బ్యాంకులు టూ–ఫ్యాక్టర్‌‌‌‌ అథెంటికేషన్‌‌‌‌ ద్వారా యాప్‌‌‌‌ వాడకానికి అనుమతి ఇస్తాయి. దీనివల్ల మరింత సెక్యూరిటీ ఉంటుంది. ఏ దశలోనూ పాస్‌‌‌‌వర్డ్‌‌‌‌ లేదా పిన్‌‌‌‌ నంబరు ఇతరులకు తెలియకుండా/ఊహించకుండా జాగ్రత్తపడాలి. ఉదాహరణకు మీ బ్యాంక్‌‌‌‌ యాప్‌‌‌‌ను మొబైల్‌‌‌‌లో వాడుతున్నారనుకుందాం. వెరిఫికేషన్ ఓటీపీ మీ మొబైల్‌‌‌‌కే వస్తుంది. మాల్‌‌‌‌వేర్‌‌‌‌ ద్వారా హ్యాకర్‌‌‌‌ ఇలాంటి ఓటీపీలను దొంగిలించేందుకు అవకాశాలు ఉంటాయి. ఇలాంటి వాటిని అడ్డుకోవాలంటే ఫోన్లో అనధికార యాప్స్‌‌‌‌ (ఏపీకే ఫైల్స్‌‌‌‌ వంటివి) డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేయకూడదు. అన్ని ట్రాన్సాక్షన్లకు నోటిఫికేషన్లు వచ్చేలా చేసుకోవాలి.

కనెక్టివిటీ విషయంలోనూ జాగ్రత్త తప్పనిసరి

పబ్లిక్‌‌‌‌ వై–ఫై వంటి అన్‌‌‌‌సెక్యూర్డ్‌‌‌‌ ఇంటర్నెట్‌‌‌‌ కనెక్షన్లతో బ్యాంకింగ్‌‌‌‌ యాప్స్‌‌‌‌ వాడటం మంచిది కాదు. రైల్వే స్టేషన్లలో, ఎయిర్‌‌‌‌పోర్టుల్లో ఉచిత వై–ఫై కనెక్షన్లు ఉంటాయి. వీటివల్ల నెట్‌‌‌‌ కనెక్టివిటీ వస్తుంది కానీ బ్యాంకింగ్‌‌‌‌ యాప్స్‌‌‌‌ వాడటం మంచిది కాదు. మన సమాచారం నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయే అవకాశాలు ఉంటాయి. సైబర్‌‌‌‌కేఫ్‌‌‌‌, షేర్డ్‌‌‌‌ కంప్యూటర్స్‌‌‌‌ ద్వారా కూడా ట్రాన్సాక్షన్స్‌‌‌‌ చేయకపోవడమే మంచిది. వీలైనంత త్వరగా మన పర్సనల్‌‌‌‌ కంప్యూటర్లు, సొంత మొబైల్స్‌‌‌‌తోనే ఫైనాన్షియల్‌‌‌‌ ట్రాన్సాక్షన్లు చేయాలి.

For More News..

ఈసారైనా రాయల్స్‌ రాత మారేనా?

రాష్ట్రంలో భారీగా పెరిగిన టూ వీలర్‌ సేల్స్‌