దొడ్డి కొమురయ్య దొరలతో పోరాడిండు : బీర్ల అయిలయ్య

దొడ్డి కొమురయ్య దొరలతో పోరాడిండు : బీర్ల అయిలయ్య
  •     ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, మందుల సామెల్

మోత్కూరు, వెలుగు: దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో దొరలు, జాగీర్దార్లతో పోరాటం చేసిన యోధుడని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు.  మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో కురుమ సంఘం, కురుమ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని మంగళవారం  ప్రారంభించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  కొమురయ్య  భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం పోరాటం చేసి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడుగా నిలిచారని గుర్తుచేశారు. ఆయన మృతితో  సాయుధ పోరాటం ఉవ్వెత్తున ఎగిసి ప్రజలు దొరలను తరిమికొట్టారని తెలిపారు.   మోత్కూరులో కురుమ సంఘం భవనం కోసం స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు గొరిగె నర్సింహ, ఉపాధ్యక్షుడు కుండె వెంకటేశ్, సహాయ కార్యదర్శి చిగుళ్ల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు నోముల వెంకన్న, కార్యదర్శులు బండ లింగయ్య, డి.యాదగిరి, మండల అధ్యక్షుడు అరిగె సాయిలు,  అయిలయ్య, చేగూరి మల్లేశం, కొల్లు పెద్దరమేశ్, కప్పె వెంకటేశం, కొల్లు శంకర్, రమేవ్ తదితరులు పాల్గొన్నారు.