కవిత లేఖతో బీఆర్ఎస్ పదేండ్ల పాపాలు బయటవడ్డయ్ : బీర్ల అయిలయ్య

కవిత లేఖతో బీఆర్ఎస్ పదేండ్ల పాపాలు బయటవడ్డయ్ : బీర్ల అయిలయ్య
  • ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

హైదరాబాద్, వెలుగు: పదేండ్లపాటు అధికారంలో ఉండి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ చేసిన పాపాలను ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత బయటపెట్టారని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఆరోపించారు. శుక్రవారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ మునిగిపోయే నావ అని, అందులోంచి కవిత బయటకు దూకాలని చూస్తున్నారని అన్నారు. 

వరంగల్ సభలో కేసీఆర్ ఒక్కరే మాట్లాడి నియంతనని చాటుకున్నారని, బీజేపీతో ఆ పార్టీకి ఉన్న సంబంధాన్ని కవిత బయటపెట్టారని చెప్పారు. పదేండ్లు దోచుకున్న  ఆస్తుల పంపకాల్లో తేడాలు రావడంతోనే కవితకు ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలు గుర్తుకు వచ్చారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నుంచి బయటకు పంపుతారన్న భయంతోనే కవిత ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. హరీశ్‌‌‌‌ రావు బీజేపీలోకి పోతానంటే కేటీఆర్ ఆయన ఇంటికిపోయి కాళ్లు పట్టుకున్నట్లు తాను మీడియాలో చూశానన్నారు.