కూలర్ కొంటున్నారా.. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

కూలర్ కొంటున్నారా.. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి
సంక్రాంతి పండగ అయిపోగానే.. చలి కూడా తగ్గుముఖం పట్టినట్లే కనిపిస్తోంది. ఉదయం.. రాత్రిళ్లు చలి చంపేస్తూనే ఉన్నా.. పగలు పొద్దెక్కగానే ఎండ వేడితో ఉక్కపోత పెరుగుతోంది. ఇప్పుడే ఇంత ఉక్కపోత ఉంటే.. వచ్చే మార్చి.. ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటుందో అనిపిస్తుంది కదూ. వచ్చే ఎండా కాలం కోసం ధర పెరగకముందే మార్కెట్లో ఉన్న కూలర్లు కొనాలని ఆలోచించే వారి కోసం కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోమంటున్నారు నిపుణులు.. అవి మీ కోసం..  గాలిలోని వేడిని నీటి ఆవిరితో తగ్గించటమే ఎయిర్ కూలర్ల బేసిక్ సూత్రం.  దీన్నే ఎవాపరేటివ్ కూలింగ్ అంటారు. అయితే దీనివల్ల ఆ ఆవిరి అంతా ఇంట్లో ఉండే గాలిలో కలవటం వల్ల ఇంటి లోపల తేమ శాతం పెరిగిపోతుంది. గాలిలో తేమ శాతం ఎక్కువయితే మళ్ళీ ఉక్కపోత మొదలవుతుంది… ఇలా అవకూడదంటే… ఎయిర్ కూలర్ వాడుతున్నప్పుడు తలుపులు, కిటికీలు మూసి ఉండకూడదు. ఇంట్లో తేమ పెరగకూడదు అంటే ఇంట్లోని గాలి బయటికి, బయటిగాలి ఇంట్లోకి వచ్చేలా వెంటిలేషన్ ఉండాలి. ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న హైఎండ్ ఎయిర్ కూలర్లలో హ్యుమిడిటీ కంట్రోలింగ్ ఆప్షన్లు ఉంటున్నాయి. గాలిలోని తేమ శాతాన్ని తగ్గించేలా వాటిలో ఏర్పాట్లు ఉంటాయి. అలాంటి కూలర్లు అయితే వెంటిలేషన్ లేకున్నా పెద్దగా ఇబ్బంది ఉండదు. అయినా కూడా వెంటిలేషన్ ఉంటేనే ఉత్తమం. తేమకోసం కాకపోయినా స్వచ్ఛమైన గాలి ఉండటం అవసరం. కోస్టల్ ఏరియాల్లో అయితే హ్యుమిడిటీ కంట్రోల్ ఉన్న కూలర్ నే తీసుకోవాలి, లేదంటే ఎయిర్ కండిషనర్ తీసుకోవటం బెటర్‌‌. వాటివల్ల హ్యుమిడిటీ సమస్యలు ఉండవు. ఇవి కూడా చదవండి పెరిగిన పెట్రో పన్నులతో.. ఎక్సైజ్ డ్యూటీ కలెక్షన్ ఎంత పెరిగిందంటే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పై గ్రీన్ ట్రిబ్యునల్‌లో విచారణ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ అప్డేట్: కనిపించని వారితో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారు జడ్చర్ల నుంచి జపాన్ వరకు.. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అన్నార్థుల ఆకలి తీర్చే ఆలయం