ప్రతీ వర్షపు బొట్టును ఒడిసి పట్టాలి : అసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత

ప్రతీ వర్షపు బొట్టును ఒడిసి పట్టాలి : అసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత
  •     అసిఫాబాద్​ జిల్లా కలెక్టర్ హరిత

కాగజ్ నగర్, వెలుగు: ప్రతీ వర్షపు బొట్టును ఒడిసి పట్టి భూమిలోకి ఇంకేలా చేయాలని కలెక్టర్ హరిత సూచించారు. మంగళవారం కాగజ్ నగర్ మండలం జంబుగా రైతు వేదికలో భూగర్భజల, సమృద్ధి సొసైటీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రపంచ నీటి దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. భూగర్భ నీటి మట్టాన్ని పెంచాలని వాగులపై చెక్ డ్యాములు, నీటి కుంటలు, బోర్ల సమీపంలో ఇంకుడు గుంతలను నిర్మించినట్లు చెప్పారు. దీనివల్ల భూగర్భజలాలు పెరిగి సాగుకు, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. 

కార్యక్రమంలో జిల్లా భూగర్భ నీటి వనరుల అధికారి, డీఏవో వెంకట్, ఉద్యాన శాఖ అధికారి  నదీమ్, మిషన్ భగీరథ ఈఈ సిద్దిక్, ఫిషరీన్ ఏడీ సాంబశివరావు పాల్గొన్నారు. అనంతరం ఆమె పెంచికల్ పేట్ మండలం లో కేజీబీవీ, పీహెచ్ సీ, అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విధుల్లో బాధ్యతగా ఉండాలని సూచించారు.