మార్కెట్‌లో లిస్టింగ్ కాకముందే.. షేర్లను కొనొచ్చు ఇలా!

మార్కెట్‌లో లిస్టింగ్ కాకముందే.. షేర్లను కొనొచ్చు ఇలా!

బిజినెస్‌‌‌‌డెస్క్‌‌‌‌, వెలుగు: ఈ ఏడాది చాలా ఐపీఓలు మార్కెట్‌‌‌‌ను టచ్ చేశాయి. కొన్ని ఐపీఓలకు సబ్‌‌‌‌స్క్రయిబ్ చేసుకున్నా షేర్ల అలాట్‌‌‌‌మెంట్ జరగలేదు...అదే మార్కెట్లో లిస్టింగ్ కాకముందే కంపెనీ షేర్లను కొనుక్కుంటే ఎలా ఉంటుంది? పేటీఎం, నైకా, ఓలా, ఫోన్‌‌‌‌పే వంటి కంపెనీ  ఐపీఓకి రావాలని చూస్తున్నాయి. వీటి షేర్లను ఐపీఓలో కంటే ముందే కొనుక్కుంటే ఇంకా తక్కువ రేటుకే పొందొచ్చు కదా!  రిస్క్‌‌‌‌ తీసుకునే ఇన్వెస్టర్లు అన్‌‌‌‌లిస్టెడ్‌‌‌‌ షేర్లను కొనుక్కోవచ్చు.  అనలహ్‌‌‌‌ క్యాపిటల్‌‌‌‌, ట్రేడ్‌‌‌‌అన్‌‌‌‌లిస్టెడ్‌‌‌‌, అన్‌‌‌‌లిస్టెడ్‌‌‌‌కార్ట్‌‌‌‌  వంటి ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లు ఈ సర్వీస్‌‌‌‌లను అందిస్తున్నాయి. కంపెనీలు ఉద్యోగులకు ఈసాప్స్‌‌‌‌ (షేర్లను బోనస్‌‌‌‌లుగా ఇస్తాయి) ఇస్తుంటాయి. కొన్ని ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లు ఈ ఉద్యోగులు, కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లను బయ్యర్లతో కలుపుతున్నాయి.  సాధారణంగా సెల్లర్‌‌‌‌‌‌‌‌ ఒక రేటు దగ్గర షేర్లను అమ్ముతారు. ఆ రేటు నచ్చితే బయ్యర్ కొనుక్కోవచ్చు. ఈ రేటులోనే బ్రోకర్ల కమిషన్లు కూడా కలిసి ఉండే అవకాశాలు ఉంటాయి.  బయ్యర్లకు డీమాట్ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్‌‌‌‌లోకి అన్‌‌‌‌లిస్టెడ్ షేర్లు యాడ్ అవుతాయి.  కనీసం రూ. 25 వేలు ఇన్వెస్ట్​ చేయాలని ట్రేడ్‌‌‌‌అన్‌‌‌‌లిస్టెడ్‌‌‌‌ చెబుతోంది. మిగిలిన కంపెనీలు కనీస అమౌంట్ ఎంత ఉండాలో ప్రకటించలేదు. 
అన్‌‌‌‌లిస్టెడ్ షేర్లను కొనొచ్చా?
ఐపీఓ రేటు కంటే అన్‌‌‌‌లిస్టెడ్ మార్కెట్లో షేర్ల రేట్లు తక్కువగా ఉంటాయి. ఇన్వెస్టర్లు కూడా భారీగా లాభాలు సంపాదించొచ్చు. కానీ,  రిస్క్ కూడా అలానే ఉంటుంది. సాధారణంగా లిస్టెడ్ షేర్లను బీఎస్‌‌‌‌ఈ, ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈలలో కొనొచ్చు. నచ్చకపోతే వెంటనే అమ్మేయొచ్చు. కానీ, అన్‌‌‌‌లిస్టెడ్ మార్కెట్‌‌‌‌లో అలా కాదు. ఈ మార్కెట్‌‌‌‌లో లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. అందువలన ఇన్వెస్టర్లు తన షేర్లను అమ్మాలనుకున్నప్పుడు కొనేవారు దొరక్కపోవచ్చు. అన్‌‌‌‌లిస్డెడ్ షేర్లు మార్కెట్‌‌‌‌లో లిస్టింగ్ కావడానికి ఎక్కువ టైమ్‌‌‌‌ తీసుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో అన్‌‌‌‌లిస్టెడ్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లో షేర్ల వాల్యూ పడిపోతుంది. ఉదాహరణకు 2019 లో హెచ్‌‌‌‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌‌‌ ఐపీఓకి వస్తుందనే అంచనాలు భారీగా ఉండేవి. ఆ టైమ్‌‌‌‌లో అన్‌‌‌‌లిస్టెడ్ మార్కెట్‌‌‌‌లో ఈ కంపెనీ షేర్లు భారీగా ట్రేడయ్యాయి. కానీ, ఇప్పటి వరకు ఈ కంపెనీ మార్కెట్‌‌‌‌లో లిస్టింగ్ కాలేదు. కంపెనీల ఐపీఓలు ఆలస్యమయితే అన్‌‌‌‌లిస్టెడ్ మార్కెట్‌‌‌‌లో వీటి షేర్ల ధరలు తగ్గొచ్చు. లిస్టెడ్ కంపెనీల మాదిరి అన్‌‌‌‌లిస్టెడ్ కంపెనీలకు సంబంధించిన  ఇన్ఫర్మేషన్‌‌‌‌ పెద్దగా అందుబాటులో ఉండదు. లిస్టెడ్ కంపెనీల కంటే అన్‌‌‌‌లిస్టెడ్ కంపెనీలు మంచి డివిడెండ్లను ప్రకటిస్తాయని ఎనలిస్టులు అంటున్నారు.  
అన్‌‌‌‌లిస్డెడ్‌‌‌‌ కంపెనీల కోసం ఫండ్స్‌‌‌‌..
కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌‌‌‌ సపరేట్‌‌‌‌గా అన్‌‌‌‌లిస్టెడ్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు స్పెషల్ ఫండ్స్‌‌‌‌ను తీసుకొస్తున్నాయి. రిస్క్‌‌‌‌ ఎందుకనుకునే వారు ఈ ఫండ్‌‌‌‌లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. 

ఈ రిస్క్‌‌‌‌లు ఉంటాయి..
సెబీ రూల్స్ ప్రకారం ఒక కంపెనీ మార్కెట్‌‌‌‌లో లిస్టింగ్ అయ్యాక, అప్పటికే ఇన్వెస్టర్లుగా ఉన్నవారు తమ వాటాలను కనీసం ఆరు నెలల వరకు అమ్మకూడదు. దీన్నే లాకింగ్ పిరియడ్ అంటున్నారు. ఈ విషయాన్ని గమనించాలి. రెండోది అన్‌‌‌‌లిస్డెడ్ మార్కెట్‌‌‌‌లో ఇన్‌‌‌‌స్టిట్యూషనల్‌‌‌‌ ఇన్వెస్టర్ల హవా ఎక్కువగా ఉంటుంది. ట్రాన్సాక్షన్లు వీరి మధ్య చాలా నెమ్మదిగా జరుగుతాయి. ఇన్వెస్టర్లు తమ ట్రాన్సాక్షన్ డబ్బులను వెంటనే పొందలేకపోవచ్చు. మార్కెట్‌‌‌‌లో లిస్టింగ్ అయిన ఏడాదిలోపు షేర్లను అమ్మేస్తే, వచ్చిన లాభాలను ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌ ఆదాయానికి యాడ్ చేస్తారు. తను ఏ ట్యాక్స్‌‌‌‌ బ్రాకెట్‌‌‌‌లోకి వస్తారో చూసి ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ ట్యాక్స్ విధిస్తారు. అదే  ఏడాది తర్వాత అమ్మితే వచ్చిన లాభాల్లో ఇన్ఫ్‌‌‌‌ఫ్లేషన్ ప్రభావాన్ని లెక్కించి మిగిలిన అమౌంట్‌‌‌‌పై 20 శాతం లాగ్‌‌‌‌టెర్మ్‌‌‌‌ క్యాపిటల్ గెయిన్ విధిస్తారు. 

లిస్టింగ్ తర్వాత లాభాలిచ్చిన కంపెనీలు(రేట్లు రూ.లలో)..
కంపెనీ    ప్రీ-ఐపీఓ రేటు    ఐపీఓ ధర    లిస్టింగ్ రేటు    ప్రస్తుత ధర
బీఎస్‌‌‌‌ఈ    200    806    1069    1158
ఆర్‌‌‌‌‌‌‌‌బీఎల్‌‌‌‌    60    225    301    174
ఐసీఐసీఐ లంబార్డ్‌‌‌‌    400    661    680    1,620
డీమార్ట్‌‌‌‌    280    300    616    4428
సీడీఎస్‌‌‌‌ఎల్‌‌‌‌    60    149    261    1298