Crypto Assets: ఇటీవల భారీగా బూమ్ అందుకున్న పెట్టుబడుల్లో ఒకటి క్రిప్టోలు. అందులోనూ బిట్ కాయిన్ అనగానే చాలా మంది ఇన్వెస్టర్లకు పరిచయం అక్కర్లేదు. అయితే ఇవి పెట్టుబడిగా లాభాలు అందిస్తున్నప్పటికీ.. భారత చట్టాలు వాటిని ఆస్థిగా గుర్తిస్తున్నాయా..? అనే అనుమానాలు చాలా మందిలో పేరుకుపోతున్నాయి. అయితే ఇటీవల క్రిప్టోలపై దేశంలోని వివిధ హైకోర్టులు ఇచ్చిన తీర్పులు ఈ అనుమానాలను నివృత్తి చేస్తోంది.
తాజాగా రుతికుమారి వర్సెస్ జాన్మై ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేసులో అక్టోబర్ 25న మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు భారతదేశంలో డిజిటల్ అసెస్ట్స్ కి సంబంధించి అభివృద్ధి చెందుతున్న న్యాయవ్యవస్థలో మార్పులను సూచిస్తోంది. క్రిప్టోకరెన్సీలు భారత చట్టం ప్రకారం 'ఆస్తి' అని హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా మందిలో గూడుకట్టుకున్న అనుమానాలను బద్ధలుకొట్టేసింది. క్రిప్టో చట్టబద్ధమైన లీగల్ టెండర్ కాదని అంగీకరిస్తూనే కోర్టు ఇలా చెప్పటం గమనార్హం. అయితే క్రిప్టో ఆస్తులు ప్రజలు డిజిటల్ రూపంలో హోల్డ్ చేస్తూ, ఆస్వాధించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కోర్టు గుర్తించింది.
ఒక్కసారి కోర్టు తీర్పును నిశితంగా పరిశీలిస్తే.. భారత చట్టాల ప్రకారం క్రిప్టో ఒక ఆస్థి అని, అయితే వర్చువల్ రూపంలో ఉన్నట్లు చెప్పింది కోర్ట్. అలాగే కస్టమర్లు లేదా పెట్టుబడిదారులకు పరిరక్షణకు అవకాశాన్ని సూచిస్తోంది. ఎక్స్ఛేంజీలలోని వర్చువల్ డిజిటల్ ఆస్తులపై నమ్మకంపై కోర్టు తీర్పు విశ్వాసాన్ని పెంచింది. పెట్టుబడిదారుల ఆస్తులను ఎక్స్ఛేంజీలు రక్షకులుగా మాత్రమే ఉండాలని ఎట్టిపరిస్థితుల్లోనూ వాటిని రీస్ట్రక్చరింగ్ ప్లాన్స్ కింద డిస్ట్రిబ్యూట్ చేయరాదని హైకోర్టు స్పష్టం చేసింది.
ALSO READ : OpenAI పెద్ద గిఫ్ట్!
దీనికి ముందు కూడా బాంబే హైకోర్టు అక్టోబర్ 7న విజిర్ఎక్స్ అలాగే కాయిన్ డీసీఎక్స్ కేసుతో ఎక్స్ఛేంజీ తన నష్టాలను ఎట్టిపరిస్థితుల్లో వినియోగదారుల మధ్య పంచటం కుదరదని తేల్చి చెప్పటం చూశాం. వాస్తవానికి విజిర్ఎక్స్ కంపెనీ వాలెట్లపై జరిగిన సైబర్ దాడిలో 234 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టోలు దొంగిలించబడిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మారుతున్న పెట్టుబడి వాతావరణంలో న్యాయవ్యవస్థలు కూడా టెక్నాలజీ పాత్రను అర్థం చేసుకుంటూ క్రిప్టో ఎక్స్చేంజీలు పూర్తిగా జవాబుదారీతనం కలిగి ఉండాలని పలు తీర్పుల్లో స్పష్టం చేయబడ్డాయి. కోర్టులు ఇస్తున్న తీర్పులను ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజీ జియోటాస్ స్వాగతిస్తూ.. ఇది కస్టమర్లలో నమ్మకాన్ని, క్రిప్టోల చట్టబద్ధతపై అపోహలకు జవాబునిస్తోందని చెప్పింది. ఇన్వెస్టర్ల పెట్టుబడులకు అత్యుత్తమ రక్షణతో కూడిన భద్రతా చర్యలు, సౌకర్యవంతమైన సేవలను అందించటంలో, చట్టాలను పాటించటంలో ముందున్నట్లు జియోటస్ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ చెప్పారు.
