Allu Arjun: చెర్రీ-ఉపాసన దంపతులకు.. డబుల్ లవ్ అంటూ అల్లు అర్జున్ స్పెషల్ విషెష్

Allu Arjun: చెర్రీ-ఉపాసన దంపతులకు.. డబుల్ లవ్ అంటూ అల్లు అర్జున్ స్పెషల్ విషెష్

రామ్ చరణ్-ఉపాసన దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. శనివారం (జనవరి 31న) ఈ మెగా దంపతులు ఒక అబ్బాయి మరియు ఒక అమ్మాయికి జన్మనిచ్చారు. ఈ బ్లాక్ బస్టర్ గుడ్ న్యూస్తో మెగా ఫ్యామిలీలో సంబరాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా సినీ స్టార్స్ సోషల్ మీడియా వేదికగా విషెష్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. లేటెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా స్పెషల్ విషెష్ తెలియజేశారు. 

అల్లు అర్జున్ X వేదికగా రామ్ చరణ్–ఉపాసన దంపతులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. “రామ్ చరణ్, ఉపాసనలకు బెస్ట్ విషెష్. మరోసారి అద్భుతమైన తల్లిదండ్రులుగా మారినందుకు అభినందనలు. చుట్టూ అపారమైన ఆనందం, ఉత్సాహం నెలకొంది. తాతయ్య చిరంజీవి, నానమ్మ సురేఖమ్మ గారి ముఖాల్లో కనిపిస్తున్న సంతోషమే ఈ క్షణాల ప్రత్యేకతను చెబుతోంది. ఆ చిన్నారులు తమ రాకతో ఈ ప్రపంచంలోకి ఎంతో ఆనందాన్ని తీసుకువచ్చారు. డబుల్ లవ్, డబుల్ జాయ్ – ఒక అందమైన కొత్త ఆరంభం” అంటూ అల్లు అర్జున్ తన ప్రేమను తెలియజేశారు.

అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాలు:

వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ సాహసోపేతమై ప్రాజెక్టులకు సిద్ధమవుతున్నారు. బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు అట్లీతో కలిసి సరికొత్త భారీ సినిమాకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం AA22 x A6 ( వర్కింగ్ టైటిల్‌) చిత్రానికి సంబంధించిన షూటింగ్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. పుష్ప2 తర్వాత అల్లు అర్జున్ కెరీర్ లో అత్యంత గొప్ప చిత్రంగా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. అలాగే, మరో తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ తో AA23 కూడా లైనప్ లో ఉంది. ఇటీవలే అప్డేట్ కూడా వచ్చింది. ఈ సినిమాలపై  అటు అభిమానుల్లో, సినీ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

మరోవైపు ప్రస్తుతం రామ్ చరణ్ తన 16వ చిత్రంపై దృష్టి పెట్టారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi) షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం మార్చి 27, 2026న విడుదల కానుంది. ఆ తర్వాత కొద్దిరోజుల విరామం తీసుకుని, జూలై 2026 నుండి రామ్ చరణ్ సుకుమార్ సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం సుకుమార్ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు.