Women's ODI World Cup 2025: లేడీ సెహ్వాగ్ వచ్చేసింది: సెమీస్‌కు ముందు భారత జట్టులో షెఫాలీ

Women's ODI World Cup 2025: లేడీ సెహ్వాగ్ వచ్చేసింది: సెమీస్‌కు ముందు భారత జట్టులో షెఫాలీ

వరల్డ్ కప్ సెమీస్ ముందు టీమిండియాకు శుభవార్త. భారత జట్టులో షెఫాలీ వర్మ వచ్చి చేరింది. పవర్ హిట్టింగ్ తో మ్యాచ్ ను మలుపు తిప్పగల షెఫాలీ జట్టులో చేరడం భారత జట్టుకు కలిసిరానుంది. ప్రతీక రావల్ స్థానంలో షెఫాలీ వర్మ ను సోమవారం (అక్టోబర్ 27) స్క్వాడ్ లో చేర్చారు. నిలకడగా ఆడుతున్న ప్రతీక రావల్ సేవలను కోల్పోవడం నిరాశపరిచేదే అయినా ఆమె స్థానంలో దూకుడుగా ఆడగల షెఫాలీ రావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాతో గురువారం (అక్టోబర్ 30) జరగబోయే సెమీ ఫైనల్లో ఈ పవర్ హిట్టర్ సమితి మందనతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనుంది. 

ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న టీమ్ టాపార్డర్ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షెఫాలీ వర్మపై సెలెక్టర్లు వేటు వేసిన సంగతి తెలిసిందే.  గత ఏడాది ఆస్ట్రేలియాలో ఆడే మూడు వన్డేల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొనే టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఆమెను తప్పించారు. 20 ఏండ్ల షెఫాలీ 2024 వన్డేల్లో ఆరు వన్డేల్లో 108 రన్స్ మాత్రమే చేయడంతో ఆమెపై వేటు పడింది. ఆ తర్వాత న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లోనూ షెఫాలీకి చోటు దక్కలేదు. అదే సమయంలో ప్రతీక రావల్ అద్భుతంగా రాణించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఐపీఎల్ లో సూపర్ ఫామ్ తో టీ20ల్లో స్థానం దక్కించుకున్న ఈ టీమిండియా ఓపెనర్ చక్కగా రాణించి వన్డే జట్టుకు ఎంపికైంది. 

►ALSO READ | Ashes 2025-26: యాషెస్ తొలి టెస్టు.. స్టీవ్ స్మిత్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్సీ.. కమ్మిన్స్ స్థానంలో బోలాండ్

ఆదివారం (అక్టోబర్ 26) బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ప్రతీక రావల్ చీలమండ గాయంతో బాధపడింది. మ్యాచ్ తర్వాత 25 ఏళ్ల ఈ  యువ ఓపెనర్ కు స్కానింగ్ తీయగా ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. వరల్డ్ కప్ సెమీస్ కు చేరాలంటే న్యూజిలాండ్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో రావల్ సెంచరీతో చెలరేగింది. ఆస్ట్రేలియా లాంటి పవర్ ఫుల్ జట్టుపై ఈ టీమిండియా ఓపెనర్ దూరం కావడంతో ఇండియాకు గట్టి ఎదురు దెబ్బ తగలనుంది. బంగ్లాదేశ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లోనూ ఆమె గాయం కారణంగా బ్యాటింగ్ చేయలేకపోయింది. అమన్ జ్యోత్ కౌర్ తో కలిసి స్మృతి మందాన ఇన్నింగ్స్ ఆరంభించింది.