ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో పంబాల నందిని (18) అనే యువతి చీరతో ఉరి వేసుకుని మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరుట్ల గ్రామానికి యువతి ఇంటర్మీడియట్ చదువు మానేసి ఇంటి వద్దే ఉంటుంది.
సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కి చీరతో ఉరివేసుకుంది. తండ్రి మేస్త్రీ పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చి చూస్తే నందిని ఉరివేసుకుని ఉండడాన్ని గమనించి షాక్‌కు గురయ్యాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేశారు.
ఫోన్ డేటా ఆధారంగా మృతికి ఎవరైతే కారణమో వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే.. పోలీసులు నందిని బంధువులతో దురుసుగా ప్రవర్తించారని, తమకు న్యాయం చేయాలంటూ, పోలీసుల జులుం నశించాలంటూ నినాదాలు చేస్తూ మంచాల పోలీస్ స్టేషన్ ముందు నందిని బంధువులు, గ్రామస్తులు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు.
