హైదరాబాద్ పబ్లిక్కు ట్రాఫిక్ అలర్ట్.. రేపు (అక్టోబర్ 28, 2025) యూసఫ్ గూడ రూట్లో వెళ్లకపోవడం బెటర్ !

హైదరాబాద్ పబ్లిక్కు ట్రాఫిక్ అలర్ట్.. రేపు (అక్టోబర్ 28, 2025) యూసఫ్ గూడ రూట్లో వెళ్లకపోవడం బెటర్ !

హైదరాబాద్: అక్టోబర్ 28, 2025న అంటే.. రేపు యూసుఫ్‌గూడ, పోలీస్ గ్రౌండ్స్‌లో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులతో, సినీ పరిశ్రమకు చెందిన 24 క్రాఫ్ట్స్ అనుబంధ సంఘాలతో యూసఫ్​ గూడ పోలీస్ గ్రౌండ్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో సామాన్య ప్రజలు కూడా పాల్గొనే అవకాశం ఉంది.

ఈ కారణంగా KVBR ఇండోర్ స్టేడియం పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ప్రయాణికులు ఈ రూట్లో కాకుండా ఆల్టర్నేటివ్ రూట్స్లో వెళ్లడం బెటర్ అని, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం మీదుగా ప్రయాణాలు ప్లాన్ చేసుకోకపోవడం బెటర్ అని పోలీసులు సూచించారు. ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు స్పష్టం చేశారు.

మైత్రీవనం జంక్షన్ నుంచి యూసుఫ్‌గూడ బస్తీ, రహమత్‌నగర్, కార్మికనగర్ మరియు బోరబండ బస్టాప్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను యూసుఫ్‌గూడ బస్తీ దగ్గర ఉన్న -కృష్ణకాంత్ పార్క్-GTS ఆలయం- కళ్యాణ్ నగర్-మోతీ నగర్-బోరబండ బస్టాప్ వైపు మళ్లిస్తారు.

మైత్రీవనం జంక్షన్‌ నుంచి యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు, మాదాపూర్‌ మీదుగా జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వైపు వెళ్లే ట్రాఫిక్‌ను యూసుఫ్‌గూడ బస్తీలో ఉన్న ఆర్‌బీఐ క్వార్టర్స్‌, -కృష్ణానగర్‌ జంక్షన్‌, -జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వైపు మళ్లిస్తారు. 

►ALSO READ | ముంచుకొస్తున్న మోంథా తుఫాను.. విజయవాడలో షాపులు బంద్ చేయాలని.. కలెక్టర్ ఆదేశాలు

జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, వెంకటగిరి నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వైపు వెళ్లే ట్రాఫిక్‌ను కృష్ణానగర్ జంక్షన్ దగ్గర నుంచి శ్రీనగర్ కాలనీ, -పంజాగుట్ట వైపు మళ్లిస్తారు.

బోరబండ బస్‌స్టాప్‌ నుంచి కార్మికనగర్‌, రహమత్‌నగర్‌, యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ప్రైమ్‌ గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌, శ్రీరాంనగర్‌ ఎక్స్‌ రోడ్స్‌లో మిడ్‌ల్యాండ్‌ బేకరీ-జీటీఎస్‌ కాలనీ- కల్యాణ్‌నగర్‌ జంక్షన్‌- వెంగళ్ రావు నగర్‌- ఉమేష్‌ చంద్ర విగ్రహం యూ టర్న్‌- ఐసీఐసీఐ యూ టర్న్‌- మైత్రీవనం వైపు మళ్లిస్తారు.